»   »  భర్తపై కేసు: ఆ హీరోయిన్ డబ్బు కోసమే అంతకు తెగించిందా?

భర్తపై కేసు: ఆ హీరోయిన్ డబ్బు కోసమే అంతకు తెగించిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా ఇండస్ట్రీలో వివాహాలు, విడాకులు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు తాము భర్తగా ఎంచుకునే వాడి విషయంలో చాలా ఆలోచిస్తారు. అందం లేక పోయినా బాగా డబ్బుంటే చాలు, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చే ధోరణిలో ఉంటారనే ఓ వాదన కూడా ఉంది.

రేపు ఏమైనా తేడా వచ్చి విడిపోయినా..... భరణం రూపంలో భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆలోచించే భామలు కూడా ఉంటారని కొందరి ఆరోపణ. తాజాగా బాలీవుడ్లో ఓ హీరోయిన్ విషయంలో ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. భరణం రూపంలో వచ్చే డబ్బు కోసమే ఆమె భర్తపై కేసు పెట్టిందని, విడాకులు కోరుతోందని అంటున్నారు. అయితే ఆమె ఆరోపణ మరోలా ఉంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మందనా కరిమి

మందనా కరిమి

ఇరానియన్ మోడల్, హాట్ అండ్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మందనా కరిమి హిందీ బిగ్ బాస్ 9వ సీజన్ తర్వాత ముంబై బేస్డ్ బిజినెస్‌మెన్ గౌరవ్ గుప్తాను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడింది.

ఆరు నెలలు గడవక ముందే విడాకులు

ఆరు నెలలు గడవక ముందే విడాకులు

అయితే గౌరవ్ గుప్తా, మందన కరిమి పెళ్లి జరిగిన ఆరు నెలలు కూడా గడవక ముందే అమ్మడు విడాకుల తీసుకునే ఆలోచనకు వచ్చింది. దీంతో ఆమె డబ్బు కోసమే ఇదంతా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భర్తపై కేసు

భర్తపై కేసు

తన భర్త గౌరవ్ మీద ఆమె ముంబై పోలీస్ స్టేషన్లో గృహ హింస కేసు పెట్టింది. అతడితో కలిసి జీవించడం తన వల్ల కాదంటూ ఈ క్రమంలోనే విడాకులకు అప్లై చేస్తున్నట్లు సమాచారం.

హింసిస్తున్నాడు

హింసిస్తున్నాడు

గౌరవ్ తనను హింసిస్తున్నాడని, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.... తానను సినిమాల్లో నటించకుండా, మోడలింగ్ చేయకుండా అడ్డుకుంటున్నాడని మందన కరిమి ఆరోపిస్తున్నారు.

ఇంటి నుండి తరిమేశాడు

ఇంటి నుండి తరిమేశాడు

ఏడు వారాల క్రితమే తన భర్త తనను ఇంటి నుండి బయటకు తరిమేశాడని.... అతడిని కూల్ చేయాలని, కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని మందన కరిమి అంటున్నారు.

2 కోట్లతో పాటు నెలకు 10 లక్షల భరణం

2 కోట్లతో పాటు నెలకు 10 లక్షల భరణం

మందన కరిమి తన విడాకుల పిటీషన్లో నెలకు రూ. 10 లక్షల మెయింటనెన్స్ తో పాటు.... అతడి వల్ల తన సినిమా కెరీర్ నష్టపోయినందుకు పరిహారంగా రూ. 2 కోట్లు ఇప్పించాలని కోరారు.

English summary
Mandana, who has become a household name after appearing in the ninth season of the controversial reality show Bigg Boss, married Gaurav Gupta, a Mumbai-based businessman, in January this year. Barely six months have passed, and she has now filed a domestic violence case against her husband, and sought divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu