»   » వెండితెరపై మళ్లీ మ్యాజిక్!.. రజనీ, మమ్ముట్టితో మణిరత్నం..

వెండితెరపై మళ్లీ మ్యాజిక్!.. రజనీ, మమ్ముట్టితో మణిరత్నం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది తెరమీద మరో క్రేజీ కాంబినేషన్‌‌కు తెర లేవనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 25 ఏళ్ల క్రితం జతకట్టిన రజనీకాంత్, మమ్ముట్టి, మణిరత్నం మళ్లీ ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పమంటున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన దళపతి చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపిసేందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మీడియాలో వెలువడుతున్న వార్తల ప్రకారం రజనీ, మమ్ముట్టి కోసం సెన్సేషనల్ డైరెక్టర్ కథను తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడకపోవడంతో ఇంకా ఆసక్తిని పెంచుతున్నది.

చెలియా బాక్సాఫీస్ వద్ద..

చెలియా బాక్సాఫీస్ వద్ద..

కాగా దేశంలోనే అత్యుత్తమ దర్శకుడిగా ముద్ర వేసుకొన్న మణిరత్నం చిత్రాలు ఇటీవల కాలంలో అంతగా విజయం సాధించలేదు. ఆయన తీసిన కడలి, చెలియా చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. ఈ నేపథ్యంలో మణిరత్నంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

క్రేజ్ తగినట్టుగా..

క్రేజ్ తగినట్టుగా..

ఇలాంటి పరిస్థితుల్లో కసితో హిట్ కొట్టాలనే లక్ష్యంతో మణిరత్నం సిద్ధపడినట్టు తెలుస్తున్నది. రజనీకాంత్, మమ్ముట్టి క్రేజ్ తగినట్టుగా సినిమా కథను తయారు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. 1991లో వచ్చిన దళపతి చిత్రం కంటే గొప్ప చిత్రాన్ని రూపొందించాలనే తలంపుతో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

పా రంజిత్ చిత్రంలో..

పా రంజిత్ చిత్రంలో..

రజనీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘2.0'లో నటిస్తున్నారు. ఇందులోని ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ దాదాపు ముగిసినట్లు సమాచారం. ఈ చిత్రం తర్వాత కబాలీ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నారు. వచ్చే నెల ముంబైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ఎంపికైనట్టు సమాచారం.

గాడ్ ఫాదర్ హిట్..

గాడ్ ఫాదర్ హిట్..

ఇక మమ్ముట్టి నటించిన ది గాడ్ ఫాదర్ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నారు. ఒకవేళ మణిరత్నం చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఊపినట్టయితే మమ్ముట్టి కెరీర్‌లో మరో హిట్ పడినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

English summary
Mani Ratnam's is counted among the stalwarts of the country. His 1991's movie 'Thalapathi,' which had sensationally united thriving superstars Rajinikanth and Mohanlal onscreen. Reports suggest that Mani is currently working on a script with the two in mind, building roles suiting their stature and calibre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu