మహేష్ బాబుతో మణిరత్నం యాక్షన్ ఫిల్మ్?

మహేష్ బాబు, మణిరత్నం ఆ సినిమాకు సంబంధించిన చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, అయితే ఇంకా ఆ ప్రాజెక్టు ఖరారు కాలేదని మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు.
నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కొరటలా శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ బాబు అంగీకరించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నం సినిమా ప్రారంభమవుతుందా, దాంతో పాటు ఈ సినిమాను మహేష్ బాబు చేస్తాడా అనేది తెలియడం లేదు.


Click it and Unblock the Notifications











