»   » కల నెరవేరింది: నానితో మణిరత్నం సినిమా

కల నెరవేరింది: నానితో మణిరత్నం సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలోనే కాదు...ఇండియన్ బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో మణిరత్నం పేరును ప్రముఖంగా చెప్పుకొవచ్చు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ లాంటి చిత్రాను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే మణిరత్నం కెరీర్లోనూ హిట్లు, ప్లాపులు ఉన్నాయి. అయితే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మణి సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో నటించాలని ప్రతి స్టార్ కోరుకుంటాడు.

Mani Ratnam Movie with Nani

తాజాగా తెలుగు యువ హీరో నాని మణిరత్నం సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తన సహజ సిద్దమైన నటనతో నాని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలోనూ నానికి మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య వచ్చిన మణిరత్నం ‘ఓకే బంగారం' సినిమా తెలుగు వెర్షన్‌కు నాని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

త్వరలో మణిరత్నం తెరకెక్కించబోయే సినిమాలో నాని అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం కార్తి, దుల్కర్ సల్మాన్ లతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. మరి తెలుగు వెర్షన్ కు దుల్కర్ సల్మాన్ స్థానంలో నానిని తీసుకున్నారా? లేక మరేదైనా పాత్రకు తీసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Telugu actor Nani who is beaming with success of Bale Bale Magadivoy now bagged another big offer. The actor, who dreamt of working with Mani Ratnam, finally got the chance
Please Wait while comments are loading...