»   » రామ్ చరణ్-ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో మణిరత్నం సినిమా?

రామ్ చరణ్-ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో మణిరత్నం సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సౌత్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇద్దరి మీటింగ్ జరుగడం కూడా చర్చనీయాంశం అయింది.

కాగా... త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మణిరత్న తెలుగు, తమిళం, హిందీ బాషాల్లో ఓ సినిమా తీయబోతున్నాడని, ఇందులో రామ్ చరణ్ నటించబోతున్నట్లు టాక్.

ఐశ్వర్యరాయ్ కూడా?

ఐశ్వర్యరాయ్ కూడా?

మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్, ఐశ్వర్యరాయ్ పాత్రలు ఎంతో కీలకంగా ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అభిమానుల్లో ఆసక్తి

అభిమానుల్లో ఆసక్తి

రామ్ చరణ్, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్తలు బయటకు రాగానే మెగా అభిమానుల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. సినిమా ఎలా ఉండబోతోంది? రామ్ చరణ్, ఐశ్వర్యరాయ్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు? వారి మధ్య రిలేషన్ తెరపై ఎలా చూపించబోతున్నారని చర్చించుకుంటున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

ఇప్పటి వరకు రామ్ చరణ్ సోలో హీరోగానే చేసాడే తప్ప.... ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేయలేదు. ప్రస్తుతానికి ఈ వార్త కేవలం రూమర్స్ గానే ఉంది. మరి ఇందులో నిజం ఎంతో? తేలాల్సి ఉంది.

మరిన్ని

మరిన్ని

రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.

English summary
A few months ago, we reported that Tollywood actor Ram Charan met ace director Mani Ratnam at Chennai for a possible collaboration. Now, it seems like things are moving in a positive direction. The latest development, we hear, is that talks are on with Aishwarya Rai Bachchan, for the same project, which could be a trilingual in Tamil-Telugu-Hindi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu