»   » నయనతారకు తల్లైన స్టార్ హీరోయిన్

నయనతారకు తల్లైన స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్స్ సరసన చేసిన మనీషా కొయరాల ఇక తాను హీరోయిన్ గా పనికి రాననుకుందో ఏమో గానీ తల్లి పాత్రకు కమిటయ్యింది. మళయాళంలో నిర్మితమవుతున్న ఎలక్ట్రా అనే చిత్రంలో నయనతార కు ఆమె తల్లిగా చేయటానికి ఒప్పుకుంది. మొదట ఈ పాత్రకు ఆమెను అడగాల వద్దా, అడిగితే ఆమె ఎలా స్పందిస్తుందో అన్న సందేహంతో కొద్ది రోజులు పాటు దర్శక,నిర్మాతలు తర్జన భర్జనలు పడ్డారుట. అయితే తెగించి అడిగేయగానే ఆమె ఓకే అనటంతో షాకవటం వీరి ఒంతయిందని మళయాళ పత్రికలు రాసుకొచ్చాయి. ఇక ఈ చిత్రానికి శ్యామ్ ప్రసాద్ దర్శకుడు. ఇక ఈ విషయమై మనీషా కొయరాల మాట్లాడుతూ...శ్యామ్ నన్ను ఎప్రోచ్ అయి కథ చెప్పనప్పుడు అద్భుతంగా అనిపించింది. అందులోనూ నా పాత్ర చిత్రానికి కీలకమనిపించింది. దాంతో మారుమాట్లాడకుండా ఎగ్రిమెంట్ పై సంతకం చేసాను. మంచి పాత్ర వచ్చినప్పుడు వదులుకోకూడదనిపించింది. ఏప్రియల్ నెలాఖరునుంచి షూటింగ్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్యామ్ ప్రసాద్ మళయాళంలో డైరక్ట్ చేసిన చిత్రం ఒకటి తెలుగులో న్యూ పేరుతో డబ్బింగై త్వరలో రిలీజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu