»   » దిల్ రాజు హీరోయిన్ కి లిప్ కరెక్షన్ సర్జరీ!?

దిల్ రాజు హీరోయిన్ కి లిప్ కరెక్షన్ సర్జరీ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించిన మరో చరిత్ర భాక్సాఫీస్ వద్ద కుదేలయిన సంగతి తెలిసిందే. అయితే సరైన హీరోయిన్ ని ఎంపిక చేసుకోకపోవటమే ఆ చిత్ర అపజయానికి కారణమంటూ దిల్ రాజు ఫ్లాఫ్ నెపాన్ని ఆమెపై తోసేసారు. అది మనస్సులో పెట్టుకుందో లేక కెరీర్ మరింత ఆశతోనో గానీ ఆ చిత్ర హీరోయిన్ హీరోయిన్ అనిత తన లిప్స్ కరెక్ట్ చేసుకోవటానకి సర్జరీకి రెజీ అయిందని తెలుస్తోంది. యుస్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఆ మాటలకు చాలా హర్ట్ అయిందని, అందుకే తనను టెస్ట్ చేసే దిల్ రాజు తీసుకున్నారని ఇంటర్వూలలో చెప్పింది. అయితే అందరూ ఆమె మూతి చాలా పెద్దదిగా కనపడుతోందని, అదే అంత అందమైన ముఖంలో ఇబ్బందిగా మారిందని కామెంట్ చేయటం జరిగింది. ఆ ఫీడ్ బ్యాక్ ని ఆధారం చేస్కునే అనిత ఈ సర్జరీకి రెడీ అయిందని మరికొందరంటున్నారు. అయితే ఆమె స్నేహితురాళ్ళు మాత్రం అలాంటి ఉద్దేశ్యం అనితకు లేదని, అది కేవలం రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. అయినా సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక ఈ సర్జరీలు కామన్ అని, పెద్ద వింతేమీ కాదని తెలుగులో ఫీల్డ్ లో ఎవరిని అడిగానా చెప్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu