»   » మార్షల్ ఆర్ట్స్ తో అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’

మార్షల్ ఆర్ట్స్ తో అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేదం చిత్రం మంచి రెస్పాన్స్ అస్తోందని, ప్రేక్షకులు నటుడిగా తనని మరింత చేరువ చేసిందన్నసంతృప్తిలో ఉన్న అల్లు అర్జున్ ఇక వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న బద్రీనాథ్ పైన కేంద్రీకరించనున్నాడు. హాలివుడ్ తరహాలో ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ఉండటంతో అందుకు తగిన ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకు అల్లు అర్జున్ స్టంట్ ఫైట్ మాస్టర్ పీటర్ హర్సన్ దగ్గర శిక్షణ పొందుతున్నాడని సమాచారం.

ఇందుకు గాను పైట్ మాస్టర్ పీటర్ హర్సన్ కు భారీగా పారీతోషకం ముట్టచెప్పినట్టు సమాచారం. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ చిత్రానికి బడ్జెట్ 30కోట్లు పై చిలుకేనని బోగట్ట. ఇందులో వినాయక్ హై ఓల్టేజ్ ఆక్షన్స్ మరియు సీన్స్ ఉండటమే ఈ సినిమా యొక్క ప్రత్యేకత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu