For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆ ఎఫెక్ట్ ‘కొత్త జంట' పై పడిందా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : మారుతి నిర్మాతగా రెండు వారాల క్రితం విడుదలైన చిత్రం "లవ్ యురా బంగారం''. పక్కా బూతు చిత్రంగా టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫలితం మారుతి పై పడిందని పిల్మ్ నగర్ సమాచారం. అల్లు శిరిష్ హీరోగా ఆయన డైరక్ట్ చేస్తున్న 'కొత్త జంట' లో ఎక్కడా కొద్దిగా కూడా అడల్ట్ కంటెంట్ లేకుండా చూడమని అల్లు అరవింద్ ఆదేశించారని చెప్తున్నారు. దాంతో గత కొద్ది రోజులుగా దర్శకుడు మారితి ఆ పనిమీదే ఉన్నారని అంటున్నారు. అడల్ట్ కంటెంట్ డైలాగుల రూపంలో కానీ, విజువల్ గా గానీ లేకుండా ఉండటం కోసం కొన్ని సన్నివేశాల రీషూట్ ప్లాన్ చేసారని అంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ (పిభ్రవరి 14) ని సైతం మార్చారని మీడియాలో వినపడుతోంది.


  అయితే మారుతి క్యాంప్ దాన్ని ఖండిస్తోంది. రీషూట్ లు ఏమీ లేవని,కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే జరుగుతోందని అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అంటున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది.

  Maruthi forced to re-shoot adult content

  'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

  కొత్త జంట గురించి చెప్తూ....ఇప్పుడు నేను చేస్తున్న 'కొత్త జంట' చాలా క్లీన్ ఫిల్మ్. ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశమే కాదు, కనీసం వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా సినిమాలో కనిపించవు. కానీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆగస్ట్ 2న షూటింగ్ ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరం మొనగాళ్లం కాదు. మనలో ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి అన్నారు.

  నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. మూస కథలు కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుకున్న శిరీష్‌కు ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని, అతనికి కథ చెప్పగానే పాత్రలోకి ఇన్వాల్వ్ అయ్యాడని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమని మారుతి తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

  English summary
  
 Allu Sirish, Regina starrer ‘Kotta Janta’ directed by Maruthi is progressing at brisk pace. According to sources Maruthi was forced to re-shoot some scenes in the film. Buzz is Allu Aravind who wishes his son's film to be a clean entertainer asked Maruthi to do away with double meaning adult dialogues in the film which he included. So Maruthi is once again re-shooting those scenes. Allu Aravind is producing the film on Geetha Arts Banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more