»   » రూమరేమో... మారుతి అలా ఎందుకు చేస్తాడు

రూమరేమో... మారుతి అలా ఎందుకు చేస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాయాబజార్ మూవీస్ పతాకంపై సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు రూపొందించిన చిత్రం 'లవర్స్'.మారుతి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం జూన్ 28న ఆడియో విడుదలకు ప్లాన్ చేసారు. అదే రోజున ప్రోమో వదులుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రం గురించి ఫిల్మ్ సర్కిల్స్ ఓ న్యూస్ ప్రచారమవుతోంది. దర్శకుడు హరిని ప్రక్కన పెట్టి ...సినిమాని మారుతి డైరక్ట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. హీరో తండ్రి అయిన ఎమ్.ఎస్ రాజు చిత్రం రషెష్ చూసి తృప్తి పొందకపోవటంతో మారుతి పూనుకుని సినిమా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది రూమర్ అని యూనిట్ కి చెందిన వారు చెప్తున్నారు. మారుతి ఓ పద్దతికి కట్టుబడే వాడు అని ఇలాంటివి కేవలం ఇండస్ట్రీలోని కొందరు పుట్టించే పుకార్లు అని అంటున్నారు. ఏది నిజమో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ- రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ప్రేమలో ఓ సరికొత్త కోణాన్ని సినిమాలో ఆవిష్కరించామని, ప్రతి యువతీ యువకుడు చూడదగిన విధంగా రూపొందిన ఈ చిత్రానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కథ నచ్చి ఈ చిత్రాన్ని రూపొందించామని, షూటింగ్ సరదాగా సాగి చిత్రం అందరి అంచనాలను మించి రూపొందిందని, సుమంత్ అశ్విన్‌కు, నందితకు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌లా నిలుస్తుందని, అలాగే అనితా చౌదరి పాత్ర చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు.

Maruthi involvement in Lovers

మారుతి మాట్లాడుతూ "ఈ సినిమా క్రెడిట్ మొత్తం టీమ్‌కే చెందుతుంది. రషెస్ బావున్నాయి. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. "ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేస్తున్నాం. లవ్, రొమాంటిక్ సినిమా ఇది'' అని నందిత తెలిపారు.

సుమంత్ మాట్లాడుతూ "కథ వింటున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, సెట్స్ మీద కూడా అంతే ఎంజాయ్ చేశాను'' అని అన్నారు. హరి మాట్లాడుతూ "రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అందరూ బాగా సపోర్ట్ చేశారు'' అని తెలిపారు. టీజర్ బావుందని జె.బి. తెలిపారు

నిర్మాతలు మాట్లాడుతూ "మారుతి మంచి సహకారాన్నిస్తున్నారు. ఒక క్లీన్ రొమాంటిక్ సినిమా అవుతుంది'' అని తెలిపారు. షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మల్హర్ భట్ జోషి, సంగీతం:జె.బి., ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి., మాటలు:చింతపల్లి రమణ, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి., సమర్పణ:మారుతి, రచన, దర్శకత్వం:హరి.

English summary
Sumanth Aswin and Nanditha are teaming up for a youthful entertainer titled Lovers which will hit the big-screens soon. Lovers audio is planned for a launch on June 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu