»   »  సీన్ రివర్స్....మారుతికి హ్యాండ్?

సీన్ రివర్స్....మారుతికి హ్యాండ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న(గురువారం) విడుదలైన కొత్త జంట చిత్రం టాక్ వీక్ గా ఉండటం దర్శకుడుగా మారుతి కెరెర్ పై ఏ మేరకు పడనుంది అనేది ఇప్పుడు చాలా మంది సిని పెద్దల్లో ఆసక్తికరమైన టాపిక్. ముఖ్యంగా నితిన్ తో చిత్రం ఓకే అయ్యింది....కథ రెడీ చేస్తున్నాడు అనే విషయం ఈ చర్చలో వస్తోంది. రీసెంట్ గా ఇష్క్ చిత్రంతో ఫ్లాఫుల నుంచి కోలుకున్న నితిన్ ....కొత్త జంట రిజల్ట్ చూసి డేట్స్ ఇస్తాడా...లేక కథ నచ్చలేదని ప్రక్కన పెడతాడా అనుకుంటున్నారు. నితిన్ ఈ మధ్యనే సురేంద్ర రెడ్డి అసోశియేట్ శ్రీనివాస రెడ్డి తో చేయవలసిన చిత్రం ప్రారంభం చేసి ఆపు చేసేసాడు. దాంతో నితిన్ తన కెరీర్ కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాడంటున్నారు.

Maruthi,Nithin Film will be Stopped

ఇక కొత్త జంట చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే వరస పెట్టి యంగ్ హీరోలంతా మారుతి వద్ద క్యూ కట్టేవారు అనటంలో సందేహం లేదు. చిన్న చిత్రాలనుంచి మారుతికి ఈ చిత్రం ప్రమోషన్. గీతా ఆర్ట్స్ లాంటి మెగా బ్యానర్, అల్లు శిరీష్ హీరో కావటం, మంచి నిర్మాణ విలువలు కూడా కలిసి రాలేదు. ఈ చిత్రం హిట్ తో తర్వాత అల్లు అర్జున్ తో చిత్రం చేస్తాడనే టాక్ సైతం వినిపించింది. అదే ఊపులో మారుతి సైతం ఉన్నారు. ఇప్పుడు నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

ఇక బూతుని, కామెడీని ...లో బడ్జెట్ లో తెరకెక్కించి హిట్ కొట్టడుతున్నాడంటూ తనపై మీడియాలో వస్తున్న కథనాలను మారుతి తిరగకొట్టాలని గట్టిగా నిశ్చయించుకుని తీసినట్లున్న చిత్రం కొత్త జంట. అందులో భాగంగా సాధ్యమైనంతవరకూ ఎక్కడా బూతూ లేకుండా సీన్స్ ని తెరకెక్కించారు. అయితే బూతు ముద్రని వదిలించుకునే ప్రాసెస్ లో మారుతి సినిమాల్లో కనపించి ఆకట్టుకునే కామెడీ, యూత్ ఆలోచనలు, సమస్యలు,జోష్ కూడా మిస్సైపోయాయి. దాంతో ఈ చిత్రం రెగ్యులర్ రొటీన్ స్టఫ్ గా బయిటకు వచ్చింది. ఖచ్చితంగా ఇది మారుతి చిత్రం కాదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ...సప్తగిరి కామెడీతో బాగానే అనిపించినా సెకండాఫ్ కథకు సంభంధం లేకుండా తిరుగుతూ ఫార్ములా క్లైమాక్స్ తో ముగింపుకు వచ్చింది. నటన విషయం వదిలేస్తే అల్లు శిరీష్ కు...గౌరవం సినిమాకన్నా బెటరే అనాలి. ఉన్నంతలో రెజీనా, సప్తగిరి బాగా చేసారు. అయితే టాక్ మాత్రం బాగా లేదు.

English summary
Maruthi’s another project Raadha with Venkatesh has been shelved and he wants to prove himself with his next film. As per the reports, Maruthi is said to have narrated an entertaining subject to Nithin and the latter is completely impressed with it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu