చేతులారా అల్లు అరవిందే నాశనం చేసేసాడు

మారుతి తయారుచేసిన స్క్రిప్టులో సంపూర్ణేష్ బాబు కోసం రాసిన సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయని, వాటిని చిత్రీకరించి కూడా తొలిగించాడంటున్నారు. పోసాని మీద తీసిన ట్రాక్ మొత్తం సంపూర్ణేష్ బాబుదే అని తెలుస్తోంది. అలాగే మొదట అనుకున్న దాని ప్రకారం సంపూర్ణేష్ బాబు...శిరీష్ పనిచేసే ఛానెల్ లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తూ...రెజీనా మీద కన్నేస్తాడని, అతనికి ఎలా బుద్ది చెప్పాడన్న యాంగిల్ ఉంటుందంటున్నారు. దాన్ని తీసేసి, ఛానెల్ కి సంభంధం లేని పాత్రగా పోసానిది క్రియేట్ చేసారని చెప్తున్నారు.
ఇక మధురిమ పాత్ర సైతం ఐటం గర్ల్ కాదని ఆమె విలేజ్ నుంచి వచ్చే శిరీష్ మరదలు పాత్ర అని, అది రొటీన్ అయిపోతుందనే వంకతో దాన్ని అల్లు అరవింద్ మార్పించాడని చెప్తున్నారు. తన కొడుకు తప్ప మరెవరూ సినిమాలో హైలెట్ కాకూడదని అరవింద్ తీసుకున్న నిర్ణయం...సినిమాని అర...విందు గా మార్చేసి,ఫెయిల్యూర్ దిసగా తీసుకెళ్లిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











