»   » మరో మార్గం లేకే మారుతి ఆ నిర్ణయం

మరో మార్గం లేకే మారుతి ఆ నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొత్తజంట హిట్...దానికి మంచి కలెక్షన్స్ బాగా వచ్చాయి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. ఆ చిత్రాన్ని ఫెయిల్యూర్ ఖాతాలో కలిపేసారు. దాంతో డేట్స్ ఇస్తారనుకున్న సునీల్, నితిన్ వంటి వారు హ్యాండ్ ఇచ్చేసారు. వెంకటేష్ ముందే నో చెప్పి తప్పుకున్నాడు. ఈ నేపధ్యంలో తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి మారుతి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో ముందుకురావటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ చిత్రంలో చేయబోతోందని చెప్తున్నారు. అది మరెవరో కాదు నయనతార అని వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంతో అయినా మారుతి హిట్ కొట్టి పెద్ద హీరోల దృష్టిలోకి వెళ్తాడేమో చూడాలి.

కొత్త జంట ప్రభావం మారుతిపై బాగా పడినట్లుంది. అంతకు ముందు అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. కొత్త జంట విడుదల అయ్యాక నితిన్ తో చిత్రం అనుకుని ఆ మేరకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నితిన్ సొంత ప్రొడక్షన్ లో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ప్రారంభం స్టేజీలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. దానికి తోడు మారుతి చిన్న లో బడ్జెట్ చిత్రాలకే సరిపోతాడని,కొంచెం పెద్దవైతే ఇలా భాక్సాఫీస్ వద్ద భడేలమంటాయని టాక్ బయిలు దేరింది. అయితే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కే ఇలా టాక్ పుట్టించటం అనేది అన్యాయమే అయినా అది ఖచ్చితంగా అతని కెరీర్ పై ప్రభావం చూపుతుంది. నితిన్ తో ప్రాజెక్టు ఉండి ఉంటే మారుతి సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క.

 Maruthi's heroine oriented film ?

అందులోనూ వెంకటేష్ తో హడావిడిగా మొదలైన రాధ ప్రాజెక్టు అర్దాంతరంగా ఆగిపోవటం కూడా మారుతికి మైనస్ అయ్యింది. ఎదిగే సమయంలో ఇది పెద్ద దెబ్బే. ఇప్పుడు నితిన్ ప్రాజెక్టు కూడా నిజంగా వెనక్కి వెళ్ళటం జరిగితే మారుతికి అగ్ని పరీక్షే. ఇప్పుడు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుని కాని మరో హీరో దగ్గరకి వెళ్లలేని పరిస్ధితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తాము ఇంతకు ముందు హిట్ ఇచ్చిన హీరో దగ్గరకు వెళ్లి దర్శకులు లబ్ది పొందటానికి ప్రయత్నిస్తూంటారు. అంటే తాను ప్రేమ కధా చిత్రంతో హిట్ ఇచ్చిన సుధీర్ బాబు దగ్గరకి మళ్లీ మారుతి వెళ్లతాడా అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారిన అంశం.

మరో ప్రక్క అదేం లేదు..ఈ చిత్రంలో మారుతి తన మసాలాని వదిలేసాడు. అందుకే పోయింది. ఈ సారి మళ్లీ ఈరోజుల్లో, బస్ స్టాఫ్ వంటి సినిమాతో వస్తాడు. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాడు అంటున్నారు. అయితే మారుతి తన నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటన్నది ఇప్పటివరకూ ప్రకటించలేదు. తన వద్ద పది సంవత్సరాల వరకూ కథలు ఉన్నాయని చెప్పిన ఆయన ఈ పాటికి హీరోల వేటలో ఉండే ఉంటారంటున్నారు.కొత్త జంట హిట్ అయితే హీరోలు ..మారుతి కోసం తిరిగేవారు..ఇప్పుడు మారుతి వారి డేట్స్ కోసం తిరగాలి అంతే తేడా అంటున్నారు.

English summary
Maruthi is getting ready to experiment with a heroine oriented film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu