»   » ‘కొత్త జంట': ఓపినింగ్స్ కోసమే బూతు స్టాటజీ?

‘కొత్త జంట': ఓపినింగ్స్ కోసమే బూతు స్టాటజీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సినిమా బాగుందా లేదా అనే విషయం కన్నా ఓపినింగ్స్ ఏ మేరకు తెచ్చుకుంటాము అనేదాన్ని బట్టే, మౌత్ టాక్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే భాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. అందుకే అందరూ ఓపినింగ్స్ తమ చిత్రానికి రావాలని చేతనైన మేరకు ప్రయత్నాలు చేస్తూంటారు. ప్రస్తుతం మారుతి టీమ్ ఆ పనిలో ఉంది. అల్లు శిరీష్‌, రెజీనా జంటగా నటించిన చిత్రం 'కొత్తజంట'. మారుతి దర్శకత్వం వహించారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. 1 విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు.

  అయితే ఈ చిత్రం ఓపినింగ్స్ రప్పించటానికి ఓ స్టాటజీతో ముందుకు వెళ్తున్నారంటున్నారు. ప్రమోషన్ లో ఇది మారుతి తరహా చిత్రం అని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ స్టాటజీ ఓపినింగ్స్ రప్పించగలిగినా,లాంగ్ రన్ కు ఇబ్బంది కలిగించే అంశం అంటున్నారు. అల్లు శిరీష్ కు ఓపినింగ్స్ ఉండకపోయే అవకాసం ఉంది కాబట్టి, మారుతి తరహా చిత్రం అంటే ఓ వర్గం ఎట్రాక్ట్ అయ్యే అవకాసం ఉందని భావించే ఇలా ప్రమోషన్ ఏక్టివిటీస్ చేస్తున్నారని అంటున్నారు. అయితే మారుతి చిత్రం అంటే అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రం అనేగా అర్దం...దానికి అల్లు అరవింద్ ఒప్పుకోడుగా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  Maruthi's Kotha Janta with adult content?

  నిర్మాత మాట్లాడుతూ... ''మారుతి తరహా చిత్రమిది. అల్లు శిరీష్‌ తెరపై కనిపించే విధానం వైవిధ్యంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది.'' అన్నారు నిర్మాత.

  దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేక్షకులకు వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇంటిల్లిపాదీ చూసి ఆనందించదగ్గ సినిమా ఇది. శిరీష్‌, రెజీనా జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా '' అన్నారు.

  మధురిమ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కూర్పు: ఉద్ధవ్‌, కళ: రమణ.ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

  English summary
  Allu Sirish, Regina starrer ‘Kotta Janta’ directed by Maruthi will be release on May 1st. Buzz is Allu Aravind who wishes his son's film to be a clean entertainer asked Maruthi to do away with double meaning adult dialogues in the film which he included.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more