»   » మారుతి 'లవర్స్‌' కూడా అలాంటి సినిమానేట

మారుతి 'లవర్స్‌' కూడా అలాంటి సినిమానేట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుమంత్‌ అశ్విన్‌, నందిత జంటగా నటించిన చిత్రం 'లవర్స్‌'. హరినాథ్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మాతలు. మారుతి సమర్పకులు. జె.బి.సంగీతం అందించారు. ఈ చిత్రం గతంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం తరహా హర్రర్ కామెడీ అని విశ్వసనీయ సమాచారం. సెకండాఫ్ నుంచి పూర్తి దెయ్యం కామెడీతో కథ నడుస్తుందని, అందుకే నందితను తీసుకున్నారని చెప్తున్నారు. ఇంటర్వెల్ కు ముందు ఓ ఆసక్తికరమైన ట్విస్టు ఉంటుందని, సప్తగిరి, నందిత ల మధ్య వచ్చే హర్రర్ కామెడీ సినిమాకు హైలెట్ అయ్యి సూపర్ హిట్ దిసగా తీసుకువెళ్తుందని నమ్ముతున్నారు.

మారుతి మాట్లాడుతూ ''విభిన్నమైన ప్రేమకథ ఇది. మాటలు, స్క్రీన్‌ప్లే నేనే సమకూర్చా. దర్శకుడు హరినాథ్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సుమంత్‌ అశ్విన్‌ నటన ఆకట్టుకుంటుంది. ఎమ్మెస్‌ రాజు చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు''అన్నారు.

Maruthi's Lovers Movie is a Horror Comedy

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ... ''నన్ను హీరోగా ఎంచుకున్నందుకు మారుతికి కృతజ్ఞతలు. ఇందులో నటించడం మంచి అనుభవం. సాయి, సప్తగిరితో కలిసి చేసిన సన్నివేశాలు అలరిస్తాయి. జె.బి.సంగీతం సినిమాకి బలాన్నిస్తుంది'' అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ''మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రను ఇందులో పోషించా'' అన్నారు నందిత.

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ- రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ప్రేమలో ఓ సరికొత్త కోణాన్ని సినిమాలో ఆవిష్కరించామని, ప్రతి యువతీ యువకుడు చూడదగిన విధంగా రూపొందిన ఈ చిత్రానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కథ నచ్చి ఈ చిత్రాన్ని రూపొందించామని, షూటింగ్ సరదాగా సాగి చిత్రం అందరి అంచనాలను మించి రూపొందిందని, సుమంత్ అశ్విన్‌కు, నందితకు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌లా నిలుస్తుందని, అలాగే అనితా చౌదరి పాత్ర చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ "మారుతి మంచి సహకారాన్నిస్తున్నారు. ఒక క్లీన్ రొమాంటిక్ సినిమా అవుతుంది'' అని తెలిపారు. షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మల్హర్ భట్ జోషి, సంగీతం:జె.బి., ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి., మాటలు:చింతపల్లి రమణ, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి., సమర్పణ:మారుతి, రచన, దర్శకత్వం:హరి.

English summary
Sumanth Aswin and Nanditha are teaming up for a youthful entertainer titled Lovers which will hit the big-screens soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu