»   » మారుతి చిత్రంలో పవన్ ఇమిటేషన్

మారుతి చిత్రంలో పవన్ ఇమిటేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పేరు తలిచినా, టైటిల్ పెట్టినా, ఆయన కి సంభందించిన ఏమి తమ చిత్రంలో ఉన్నా తమ సినిమా హిట్టవుతుందనే నమ్మకం టాలీవుడ్ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆ లిస్ట్ లో మారుతి కూడా చేరనున్నారని తెలుస్తోంది. ఈ రోజుల్లో,బస్ స్టాప్, రొమాన్స్ చిత్రాలతో తనకంటూ యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న మారుతి తాజా చిత్రం 'కొత్త జంట'లో... పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లోని అత్యాక్షరి ఎపిసోడ్ ని తనదైన శైలిలో రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఆ అంత్యాక్షరి ఎపిసోడ్ లో గబ్బర్ సింగ్ అంత్యాక్షరిలో చేసిన వారినే తీసుకుని,పవన్ కళ్యాణ్ ని సైతం ఎమిటేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌ హీరోగా, రెజినా హీరోయిన్‌గా దర్శకుడు మారుతి గీతా ఆర్ట్‌‌స బ్యానర్‌లో ఈ 'కొత్త జంట' చిత్రం రూపొందుతోంది. . బన్ని వాసు ఈ చిత్రానికి నిర్మాత. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. మూస కథలు కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుకున్న శిరీష్‌కు ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని, అతనికి కథ చెప్పగానే పాత్రలోకి ఇన్వాల్వ్ అయ్యాడని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని చెప్తున్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ 'మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో శిరీష్‌ను చాలా కొత్తగా చూపించబోతున్నాడు మారుతి. మా గత చిత్రాల వాల్యూస్‌కు తగ్గకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం' అన్నారు. నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ 'శిరీష్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథను మారుతి సిద్ధం చేశాడు. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌' అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ 'గీతా ఆర్ట్‌‌సలో పనిచేయాలనే నా కల నా మూడో చిత్రంతోనే నెరవేరుతుందని కల్లో కూడా ఊహించలేదు. శిరీష్‌ కష్టపడి పనిచేసే హీరో. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎంతో క్యాజువల్‌గా మన పక్కింటి అమ్మాయి, అబ్బాయిగా కనిపిస్తారు' అన్నారు.


హిట్స్ తనఖాతాలో వున్నా బూతు చిత్రాల దర్శకుడిగా మారుతికి ముద్రపడిపోయింది. ఇప్పుడు అల్లు శిరీష్ చిత్రంతో ఆ పంధానుండి బయటకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వస్తుందని అల్లుశిరీష్ చెప్తున్నాడు. యూత్ టార్గెట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా సినిమాలో ఒక్క స్మోకింగ్ సీన్ కు గానీ, డ్రింకింగ్ సీన్ కు గానీ తావు ఇవ్వలేదని అంటున్నారు. అంతేకాక మారుతి మరియు చిత్ర బృందంతో పనిచెయ్యడం అతనికి చాలా నచ్చిందని తెలిపాడు. సమర్పకుడు: అల్లు అరవింద్‌, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, నిర్మాత: బన్నివాసు, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మారుతి.

English summary
Maruthi’s Kotta Janta shoot is happening at rapid pace and it is being said that the director is thinking of repeating Gabbar Singh’s Antyakshari magic in Kotta Janta. It is being said that the artists who were part of Gabbar Singh would form part of Antyakshari in Kotta Janta too and we hear that he would even have an imitation of Pawan Kalyan too in this episode. The makers are thinking that Antyakshari episode can be hilarious and help them in adding fun factor to the film. Kotta Janta has Allu Sirish and Regina in the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu