»   »  'కథానాయకుడు' పై మీనా మండిపాటు

'కథానాయకుడు' పై మీనా మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meena
రజనీకాంత్ నిజ జీవిత పాత్రలో నటించిన కథానాయుకుడు చిత్రం చివరకు పూర్తి స్ధాయి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అంతేగాక ఈ సినిమా పబ్లిసిటీ పట్ల ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించిన మీనా మండిపడుతోంది. తమిళంలో పశుపతి ప్రక్కన, తెలుగులో జగపతి బాబు ప్రక్కన లొ మిడిల్ క్లాస్ మహిళగా నటించిన ఆమెను పట్టించుకోకుండా టీవీ ప్రొమోలు,పోస్టర్స్ వేస్తున్నారు అని విరుచుకుపడుతోంది.

ప్రచారమంతా రజనీ,నయనతార చుట్టూ తిరుగుతోందని నిందారోపణలు చేస్తోంది. అయితే అది రజనీ వంటి సూపర్ స్టార్ నటించిన సినిమా కదా అని మీడియా వారంటే దానికామే ...కానీ మిగతా నటులు లేకుండా సినిమా ఉండదు కదా...అందులోనూ ఈ కథలో అందరికీ సమాన పాపులారిటీ ఉందని వాదిస్తోంది. ఆమెకు గతంలో రజనీతో నటించిన అనుభవం గుర్తుకు వచ్చి ఇలా భాధతో అంటోందని ,అప్పుడంటే ఆమే క్రేజ్ ఉన్న హీరోయిన్ ,కానీ ఇప్పడు నయనతార క్రేజ్ ఉన్నామె అంటున్నారు.

దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ నేను ఆ సినిమా రిలీజు రోజు హైదరాబాద్ లో ఉన్నాను. నా మిత్రులు కొంతమంది సినిమా చూసి వచ్చి చెప్పినదాన్ని విని నేను షాక్ అయ్యాను. ఆ సినిమా టైటిల్స్ లో గెస్ట్ రోల్ గా కనపడిన నయనతార పేరు క్రింద నాది వేసారు. ఎంత అవమానం. అయినా ఈ సినిమా షూటింగ్ మొదటనుంచి నన్ను సరిగా ట్రీట్ చెయ్యలేదు. మళయాళంలో నేను చేసిన పాత్ర మళ్ళీ నాకే ఇచ్చారనే ఒకే ఒక కారణంతో అంతా మాట్లాడుకుండా ఊరుకున్నాను.

అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో బాగా వచ్చిన సన్నివేశాలు చాలా కట్ చేసేసారు. అందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు.వారిలో ఒకడు అమ్మా నేను నల్లగా ఉంటానేంటమ్మా అని అడుగుతాడు. తన తండ్రి పోలికలతో పుట్టిన వాడు అలాఅడగటంతో తల్లిగా నేను చాలా ఫీలయి వాడ్ని దగ్గరకి తీసకుంటాను. సెట్ లో ఈ సన్నివేశం తీస్తున్నప్పుడు అంతా టప్పట్లు కొట్టారు. సినిమాలో చూస్తే ఆ ఎమోషనల్ సీన్ మిస్సయింది.అంటూ వాపోయింది. అయితే సినిమా పోయి ఒక ప్రక్క ఏడుస్తుంటే మధ్యలో ఈ గోలేమిటి అన్నట్లు నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X