»   » ఛీఛీ హనీమూన్ వద్దు సినిమాలే ముద్దు: మీనా!

ఛీఛీ హనీమూన్ వద్దు సినిమాలే ముద్దు: మీనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని మీనా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రంగంలో వారికి కేరీర్ తో పాటు కుటుంబ భాద్యత కూడా వుంటుంది. అది అర్ధం చేసుకొని నడుచుకొంటే సుఖ సంసారం, లేదంటే ఏదో ఒకటి వదులుకోవలసి వస్తుంది. అదే పరిస్థితి మీనాకు ఎదురైంది, తను ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. వివాహమైన తర్వాత హనీమూన్ కి వెళదామని ప్లాన్ చేసి వేళ్లే సమయానికి చివరి నిమిషంలో సినిమా షూటింగ్ కి బయలుదేరిందీ వీరనారీ.

మరి మీనాని ఆమె భర్త విద్యసాగర్ హనీమూన్ కి ప్లాన్ ఏమని కోరాడట. కానీ మీనా సినిమాలు ఒప్పేసుకుని హనీమూన్ కి హ్యాండిచ్చేసిందని సమాచారం. ఆ తర్వాత కూడా మీనా పెద్దంతగా కుటుంబ విషయాలను పట్టించుకోవడం లేదట. దీంతో ఆమె భర్త, అత్తగారు మీనాపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. వీళ్ళ కోపాన్ని పట్టించుకోకుండా మీనా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటోందట. ఇలాగే సాగితే మీనా పెళ్ళి పెటాకులయ్యే సూచనలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu