»   » ఒకప్పుడు చిరు సరసన ఇరగదీసిన మీనా చరణ్ అత్తగా...!?

ఒకప్పుడు చిరు సరసన ఇరగదీసిన మీనా చరణ్ అత్తగా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నటితరం హీరోయిన్ మీనా, తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ మధ్య 'వెంగమాంబ" సినిమాలో నటించిన మీనా, పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన సంగతి తెల్సిందే.. సినిమాలపై సరదా తీరలేదనీ, నటనపై ఆసక్తి ఇంకా పెరిగిందనీ, అందుకే రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాననీ ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా చెప్పుకొచ్చింది.

తెలుగులో ఓ యువ హీరో కి అత్తగా నటిస్తున్నానని మీనా చెప్పింది. ఆ యువ హీరో ఎవరనే విషయమై ఆరా తీస్తే, చిరంజీవి తనయుడు చరణ్ పేరు తెరపైకొచ్చింది. చరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో అత్తగా ఓ పాజిటివ్ క్యారెక్టర్ లో మీనా నటించనుందంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. చిరంజీవితో హీరోయిన్ గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా, చిరంజీవి తనయుడికి అత్తగా ఏ మేర తన సత్తా చాటుకుంటుందో వేచి చూడాల్సిందే..

English summary
Ram Charan's film with VV Vinayak is confirmed. Akula Siva who gives script to Vinayak's films has prepared a powerful plot for the story and developing the script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu