»   »  మీరా జాస్మిన్ అలిగిన వేళ

మీరా జాస్మిన్ అలిగిన వేళ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
చాలా మంది హీరోయిన్లు లాగే మీరా జాస్మిన్ కూడా తన కుటుంబాన్ని వదిలి ఒంటిరిగా ఉంటోంది. తల్లి తండ్రులు ఆమె సోదరుడు జార్జ్ తో కలసి ఉంటున్నారు. అతను మనోజ్ పిళ్ళై అనే కెమోరామెన్ దగ్గర అసెస్టెంటుగా మలయాళ సినిమాలకు పనిచేసుకుంటూ తన బ్రతుకు బ్రతుకుతున్నాడు. కాని ఆమెకి మాత్రం అతను సినిమా ఫీల్డులో ఉండటం ఇష్టం లేనట్టుంది. తాజాగా ఆమె దర్శకుడు కమల్ దర్శకత్వంలో మలయాళి హీరో పృధ్వీరాజుకి జోడీగా చేస్తోంది. కేరళ లోని త్రిసూరు లో షూటింగు జరుగుతున్నప్పుడు ఆమెకి సోదరుడు ఫేస్ టు ఫేస్ ఎదురయ్యాడట. సోదర ద్వేషం గల మీరా వెంటనే అక్కడ నుంచి కోపంగా వెళ్ళి పోయిందిట.ఏం లోపం జర్గిందో అర్దం కాక కంగారు పడి ఆమె వెనుక పరుగు తీసారట దర్శక,నిర్మాతలు. వాళ్ళు చాలా సేపు రకరకాలుగా బ్రతిమిలాడాక అసలు విషయం బయిట పెట్టిందిట. తన సోదరుడు ఉన్న సెట్ లో తను నటించనని తేల్చి చెప్పేసిందిట. దాంతో తర్జన బర్జనలు పడి చివరకు ఆమే ముఖ్యమని దర్సకనిర్మాతలు నిర్దారించుకున్నరట. నిర్దాక్ష్యంగా జార్జ్ని బయటకు పంపేసారట. పాపం జార్జ్ ...అ యినా సోదరుడు ఎదురుగా ఆమె వేషాలు వేయటం కష్టమే కదా అంటూ నర్మగర్భంగా నిట్టూర్చారట యూనిట్ వాళ్ళు .

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X