»   »  'మెగా ఎక్సప్రెస్' రామ్ చరణ్ నెక్ట్స్ చిత్రం టైటిల్ ఇదే ?

'మెగా ఎక్సప్రెస్' రామ్ చరణ్ నెక్ట్స్ చిత్రం టైటిల్ ఇదే ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం తనీ ఒరువన్ రీమేక్ గా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఆ సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా అప్పుడే బయిటకు వచ్చేసింది. ఆ టైటిల్ మరేదో కాదు..'మెగా ఎక్సప్రెస్'.

సందీప్ కిషన్ తో చేసిన తొలి చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మంచి హిట్ అవటంతో చిత్ర దర్సకుడు మేర్లపాక గాంధీ దశమారిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ రెండో సినిమాతోనూ హిట్ కొట్టి, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో పోటి పడి కూడా మంచి విజయం సాధించింది.

దీంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా మేర్లపాక గాంధీతో సినిమాకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ లిస్ట్ లో అందరి కంటే ముందున్నాడు. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ రాజా సినిమాపై పాజిటివ్ గా స్పందించిన చెర్రీ, మంచి కథ రెడీ చేస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడని సమాచారం.

'Mega Express' Title Confirmed for Ram Charan?

తొలి చిత్రం వెంకటాద్రి ఎక్సప్రెస్, రెండో చిత్రం ఎక్సప్రెస్ రాజా చేసిన మేర్లపాక గాంధీ మూడో చిత్రానికి మెగా ఎక్సప్రెస్ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎక్సప్రెస్ టైటిల్ తనకు లక్ తెచ్చి పెడుతుందని మేర్లపాక గాంధీ భావిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ధృవ చేస్తున్న రామ్ చరణ్... నవంబర్ నుంచి సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత వరుసగా రెండు లవ్ స్టోరీలు చేయాలని అనుకుంటున్నాడట చరణ్. వీటిలో ఒకటి మేర్లపాక గాంధీతో చేయనున్నాడని.. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిపోగా.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

అసలు మొదటే...ఎక్స్ ప్రెస్ రాజా తీసిన గాంధీ.. శర్వా ద్వారానే చరణ్ దగ్గరకు చేరాడని తెలుస్తోంది. రామ్ చరణ్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలంటే లవ్ స్టోరీ కంటే బెటర్ ఆప్షన్ ఉండదనే ఉద్దేశ్యంతో.. ఓ కథను కొత్తగా చెప్పాడట మేర్లపాక గాంధీ. సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేశాక దీన్ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

English summary
Director Merlapaka Gandhi is heard to have convinced Ram Charan to name their combo film 'Mega Express'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu