»   » ఇదేం పనంటూ...పూరి పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం?

ఇదేం పనంటూ...పూరి పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు శత్రువు అయ్యాడనే వార్త ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చగా నిలుస్తోంది. రీసెంట్ గా జరిగిన లోఫల్ ఆడియో పంక్షన్ కు పూరి జగన్నాథ్..చిరంజీవి గానీ మరే మెగా హీరోని కానీ పిలవకపోవటం ఓ కారణం అయితే, మెగా ఫ్యాన్స్ కు శత్రువుగా ఉన్న వర్మను ఆహ్వానించటం మరొక కారణం అంటున్నారు.

దానికి తోడు వర్మ ...ఆడియో పంక్షన్ అనంతంరం చేసిన ట్వీట్స్ తో పూరి వాళ్ళు మరింత మండిపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా 'మెగా ట్రీ నుండి ఎలక్ట్రిక్ పవర్ ని తీసుకోకుండా, తన స్వంత సోలార్ బ్యాటరూ ద్వారా రావడం నాకు నచ్చింది' అని తెలిపారు.

Mega Fans also See Puri As Enemy

ఆ తర్వాత... మళ్ళీ వర్మ ట్విట్టర్ లో"వరుణ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తి కాదని,..చెట్టుకి గౌరవం ఇస్తాడు కాని ...కోమ్మలాగా బ్రతకడం కోరుకోడని" చేసిన ట్వీట్ ఇప్పుడు చిచ్చు రేపింది.

మెగా కాంపౌండ్ కు చెందిన హీరో ఆడియో పంక్షన్ కు వచ్చిన వర్మ ఇలా కామెంట్స్ చేయటం అనేది సహజమే అయినా పూరి ఎలా తీసుకువచ్చాడంటున్నారు. మొత్తానికి దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి పూరి గురి అయ్యాడన్నమాట.

English summary
Mega fans are angry by roping RGV for the audio launch of Loafer and not inviting any mega hero to the stage, Puri has made his priorities clear.
Please Wait while comments are loading...