వైష్ణవ్ తేజ్, మెగాస్టార్ కంటే స్పీడ్ ఉన్నాడు.. వరుసగా 4సినిమాలు.. రెమ్యునరేషన్ తక్కువే కానీ

సక్సెస్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. టాలెంట్ ఎంత ఉన్నా కూడా కొన్నిసార్లు సక్సెస్ రాకపోతే మార్కెట్ మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే వైష్ణవ్ తేజ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మెగా మేనల్లుడైన వైష్ణవ్ సైలెంట్ గానే వరుసగా రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. ఇక ఇటీవల మరికొన్ని సినిమాలను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకుంటున్నాడట.

మొదటి సినిమా ఆలస్యంగా..

మొదటి సినిమా ఆలస్యంగా..


సాయి ధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ మొదట సుకుమార్ ప్రొడక్షన్ లో ఉప్పెన అనే సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ 2021 సమ్మర్ లోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు గాని పోటీ ఎక్కువగా ఉండడంతో రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు.

ఆ సినిమా కూడా వేగంగానే..

ఆ సినిమా కూడా వేగంగానే..

ఇక ఉప్పెన సినిమాపై అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమాను ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు చూసి ఈ యువ హీరో నటనపై పాజిటివ్ కామెంట్స్ చేశారట. ఇక ఆ టాక్ ఇప్పుడు వైష్ణవ్ కు అవకాశాలు అందిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రెండవ సినిమాను కూడా పూర్తి చేసేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎలాంటి అనుమానాలు లేవు

ఎలాంటి అనుమానాలు లేవు

ఇక క్రిష్ సినిమాను అలా సైలెంట్ గా ఫినిష్ చేశాడో లేదో మరికొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయట. సినిమా అంతా తొందరగా పూర్తయ్యింది అంటే హీరో టైమింగ్ లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పవచ్చు. క్రిష్ మేకింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ ప్రాజెక్ట్ అనంతరం మరో రెండు సినిమాలను కూడా ఒకే చేసినట్లు సమాచారం.

మరో రెండు సినిమాలు

మరో రెండు సినిమాలు


అక్కినేని వారి అన్నపూర్ణ ప్రొడక్షన్ లో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించే డిఫరెంట్ కథలో వైష్ణవ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ లో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడన్నమాట.

రెమ్యునరేషన్ తక్కువే..

రెమ్యునరేషన్ తక్కువే..

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే మొదటి సినిమా ఉప్పెనకు ఈ హీరో 30లక్షల లోపే తీసుకున్నాడట. ఇక క్రిష్ సినిమాకు 40లక్షల లోపు అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు చిన్న బడ్జెట్ సినిమాలే కాబట్టి ఎక్కువగా రెమ్యునరేషన్ పై దృష్టి పెట్టకుండా ఈ హీరో వచ్చిన అవకాశాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకోవాలని అనుకుంటున్నాడట. ఇక ఆ సినిమాలు హిట్టయితే వైష్ణవ్ కూడా కోట్లల్లో ఆదాయాన్ని అందుకుంటాడాని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X