»   » రెండో సినిమాకే రీమేక్...మెగా హీరో సేఫ్ గేమ్

రెండో సినిమాకే రీమేక్...మెగా హీరో సేఫ్ గేమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా కుటుంబం నుంచి మరో కుర్రాడు వరుణ్ తేజ(నాగబాబు కుమారుడు)దూసుకువస్తున్న సంగతి తెలిసిందే. గొల్లభామ (వర్కింగ్ టైటిల్ )తో రూపొందుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలోని వేర్వేరు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో చిత్రం కమిటయ్యాడని సమాచారం. హిందీలో విజయం సాధించిన ఇష్క్ జాదే చిత్రం రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని విశాఖ ఎక్సప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరక్ట్ చేస్తాడని తెలుస్తోంది. అలాగే డి.వివి దానయ్య నిర్మిస్తూండగా, హార్ట్ ఎటాక్ భామ అదా శర్మ హీరోయిన్ గా చేస్తోంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి 'గొల్లభామ' అనే పేరుని పరిశీలిస్తున్నారు. కేరళలోని కొచ్చి లో కొన్ని ప్రాతాల్లో ఈ షూట్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హేగ్డే చేస్తోంది. చిత్రంలో బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Mega Hero Varun Tej's next a Bollywood remake?

లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.

2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడు.

English summary
Varun Tej gave his consent for his second film. The film will be the re-make of Bollywood film ‘Ishqzaade’. Film is directed by Merlapaka Gandhi of ‘Venkatadri Express’ fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu