»   » 2011లో మూకుమ్మడిగా మెగా హీరోల మెగా దాడి...

2011లో మూకుమ్మడిగా మెగా హీరోల మెగా దాడి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

2009 'మగధీర" సంచలన విజయంతో 2010లోకి అడుగుపెట్టిన మెగాఫ్యామిలీకి ఈ సంవత్సరం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఒక్క మెగా ఫ్యామిలీనే కాదు..టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ తో పాటు పెద్ద హీరోలందరి చిత్రాలు..'మగధీర" మోజుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ద్వారా ఈ సంవత్సరం నిర్మాతలు నష్టపోయింది..సుమారు 50కోట్ల రూపాయలట..ఈ మధ్య ఓ చిన్న నిర్మాత ఇదే విషయంపై మెగా ఫ్యామిలీని విమర్శించిన విషయం తెలిసిందే..

వరుడు, పులి, ఆరెంజ్ చిత్రాల భారీ సెట్ లు, విదేశాల్లో షూటింగ్ లు..ఇతరత్రా కలిపి నిర్మాతల్ని పూర్తిగా కోలుకోలేని దెబ్బతియడంతో..మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, వారి అభిమానులు కూడా అతిగా ఆశించి..కోలుకోలేకపోయారు..కాకపోతే వారు చెప్పుకోవడానికి, ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు కాలర్ ఎగరేసుకోవడానికి..ఈ సంవత్సరం మిగిల్చింది..ఏమిటంటే..'మగధీర"ను మించే చిత్రం రాకపోవడమే..2010మిగిల్చిన చేదు అనుభవాలతో అన్నీ తెలుసుకున్న మెగా హీరోలు..

రాబోయే న్యూ ఇయర్ లో ఏ చిత్రమైనా 'మగధీర"ను క్రాస్ చేస్తే..ఆ చిత్రాలని వెంటనే మా చిత్రాలతో క్రాస్ చేస్తామని..తమ అభిమానులని తప్పకుండా సంతోషపెడతామని, వారు గర్వంగా చెప్పుకునేలా రాబోయే చిత్రాలు ఉంటాయని తెలుపుతున్నారు..పవన్ కళ్యాణ్ 'లవ్లీ", అల్లు అర్జున్ 'బద్రీనాథ్", రామ్ చరణ్ 'మెరుపు" చిత్రాలు 2011లో ఏప్రిల్ నుండి జూలై లోగా విడుదల కానున్నాయి. అయితే వాటికి ధీటుగా నందమూరి సినిమాలు, రాజమౌళి-ప్రభాస్, మహేష్ బాబు భారీ చిత్రాలు భారీగానే ఉన్నాయి..మరి వాటిని ఈ మెగా హీరోలు ఎలా ఎదుర్కొంటారో? వేచి చూడాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu