Don't Miss!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
రాంచరణ్ తీరుపై మెగాస్టార్ అసంతృప్తి?.. కారణం అదేనట!
సంక్రాంతి పండుగ బరిలో దిగిన వినయ విధేయ రామ ప్రేక్షకులను, అభిమానులను మెప్పించలేకపోయినప్పటికి అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది. బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబినేషన్ వచ్చిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు తక్కువ నష్టాలనే మిగిల్చింది. అయితే నష్టాలకు గురైన పంపిణీదారులను నిర్మాత డీవీవీ దానయ్య, రాంచరణ్ ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కానీ బోయపాటి వెనకడుగు వేయడం వివాదంగా మారింది. అయితే పంపిణిదారులకు నష్టాలను పూడ్చడానికి రాంచరణ్, దానయ్య తీసుకొన్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవితోపాటు కొందరు నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేశారనే వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది. అదేమిటంటే...

డిస్టిబ్యూటర్లకు స్వల్ప నష్టాలు
వినయ విధేయ రామకు తొలి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రూ.100 గ్రాస్ (రూ.65 కోట్ల నికర) వసూళ్లను సాధించింది. థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.95 కోట్లు చేయడంతో ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.30 కోట్ల నష్టాన్ని డిస్టిబ్యూటర్లకు మిగిల్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్, హీరో, నిర్మాత తలా రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే అందుకు బోయపాటి ససేమిరా అనడంతో వివాదంగా మారింది.

బోయపాటి, దానయ్య వివాదం
దర్శకుడు బోయపాటి తన వంతు వాటాను చెల్లించనని చెప్పడంతో దానయ్యతో గొడవ జరిగిందనేది సినీ వర్గాల టాక్. వారి మధ్య గొడవ తీవ్రస్థాయిలోనే జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన సినిమా హిట్ అనే భావనలో బోయపాటి ఉండటం ప్రధాన కారణం.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్: దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్.. మైండ్ బ్లోయింగ్!

స్వల్ప నష్టాలకు చెల్లింపా?
ఇదిలా ఉండగా, పంపిణీదారులకు రాంచరణ్, దానయ్య నష్టాలను పూడ్చటం పలువురు నిర్మాతలకు నచ్చలేదట. బిజినెస్‌ను బిజినెస్‌గానే చూడాలి. భారీగా లాభాలు వస్తే నిర్మాతగకు పంపిణిదారులు తిరిగి ఇస్తారా?, స్వల్ప నష్టాలు వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనే మాట వినిపిస్తున్నన్నది. ఒకవేళ భారీగా నష్టపోతే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదట.

రాంచరణ్ నిర్ణయంతో ఇదే సంప్రదాయం
వినయ విధేయ రామ విషయాన్ని పక్కన పెడితే, భవిష్యత్‌లో ఏ సినిమాకు నష్టాలు వచ్చినా ఇదే సంప్రదాయం కొనసాగే ప్రమాదముంది. స్వల్ప నష్టాలు వస్తే పంపిణీదారులు తిరిగి చెల్లించమని డిమాండ్ చేస్తారు. ఇది పరిశ్రమలో బిజినెస్‌కు మంచి సూచిక కాదు అని ఓ వర్గం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తమ నష్టాలను కొంత మేరకు పూడ్చి తమను ఆదుకొన్న రాంచరణ్‌పై పంపిణీదారులు హర్షం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్‌కు కూడా నష్టాలు
సంక్రాంతి బరిలో దూకిన మరో చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం కూడా పంపిణీదారులకు తీరని నష్టాలు మిగిల్చింది. అయితే నిర్మాతలు మాత్రం డబ్బు చెల్లించే విషయంలో ఎలాంటి స్పందన కనబర్చలేదు. ఎన్టీఆర్: మహానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఏమైనా సర్దుబాటు చేసి ఉంటారనే మాట వినిపిస్తున్నది.