Just In
- 59 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Sports
డబ్బుల కోసమే బెయిర్స్టో ఐపీఎల్ ఆడుతాడు.. డిక్విల్లా స్లెడ్జింగ్.. ఆ వెంటనే ఔట్! వీడియో
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెద్ద కోరికే : కొత్త అల్లుడి మాట కాదనలేక పోతున్న చిరంజీవి!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవల కళ్యాణ్ అనే వ్యక్తితో జరిగిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ తో వివాహం తర్వాత శ్రీజ చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఆమె మొహంలో ఎప్పుడూ చూడనంత సంతోషం కనిపిస్తుండటంతో....చిరంజీవి ఫుల్ హ్యాపీ.
కొత్త అల్లుడు అంటే ఏదో ఒక కోరిక కోరడం ఖాయం. ఇపుడు చిరంజీవికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. తన చిన్న అల్లుడు కళ్యాణ్ సినిమా హీరో అవ్వాలనే కోరిక చిరంజీవి చెవిన వేసారట. అల్లుడి మాటను కాదనలేం...అందుకే చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట.
అయితే అంతకంటే ముందుగా...ఆయన్ను యాక్టింగ్ క్లాసులకు వెళ్లాలని సూచన చేసారట చిరంజీవి. దీంతో పాటు ఫిజిక్ విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని సూచించాడట. మెగా ఫ్యామిలీ భాగమైపోయాడు....కళ్యాణ్ కు హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్ద కష్టమేమీ కాదు, తన టాలెంటుతో నిలబడటమే ఇపుడు సవాల్. బెస్టాఫ్ ఆఫ్ లక్ కళ్యాణ్.
సినీ నిర్మాణ రంగంలోకి శ్రీజ వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు సంబందించి వివరాలు స్లైడ్ షోలో..

శ్రీజ
సొంతగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించి... భర్తతో కలిసి ఇందుకు సంబంధించి వ్యవహారాలు చూసుకోవాలనేది శ్రీజ ప్లాన్.

చిన్న సినిమాలు
తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు చేయాలనే ఆలోచనతో శ్రీజ-కళ్యాణ్ ఈ దిశగా ముందుకు సాగుతున్నారు

సపోర్టు
మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ ఉంది కనుక తప్పక సక్సెస్ అవుతామనే నమ్మకంతో ఉన్నారు జంట

త్వరలో..
ప్రస్తుతం శ్రీజ సొంత ప్రొడక్షన్ ప్రతిపాదన చిరంజీవి పరిశీలిస్తున్నారని, తన అనుభవం, పరిశ్రమలో తనకు ఉన్న పరిచయాలతో శ్రీను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు అఫీషియల్ గా వెల్లడిస్తారని టాక్.