Don't Miss!
- News
టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాప్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ.. మళ్ళీ చాలా కాలం తరువాత..
మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా విభిన్నమైన ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధమయింది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో మలయాళం లో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతుంది. అంతేకాకుండా మెగాస్టార్ మరో రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అలాగే మరో మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే చర్చలో దశలో మరి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఒక కథపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు హఠాత్తుగా మరొక స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్ అయితే వస్తోంది.

అతను మరెవరో కాదు ఇండియన్ మైకల్ జాక్సన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న డాన్స్ మాస్టర్ ప్రభుదేవా అని తెలుస్తోంది. ప్రభుదేవా గతంలో తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇక హిందీలో పోకిరి రీమేక్ వాంటెడ్ తో బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే విక్రమార్కుడు సినిమాను కూడా హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. ఇక చివరగా సల్మాన్ ఖాన్ తో రాదే అనే సినిమాను డైరెక్ట్ చేయగా అది ఓటీటీ లో విడుదలైంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అలాగే మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.