»   » నాగచైతన్య సరసన మిస్ ఇండియా ఎంపిక

నాగచైతన్య సరసన మిస్ ఇండియా ఎంపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిస్ ఇండియా పూజ హెడ్గె ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


రొమాంటిక్ కామెడీ గా నడిచే ఈచిత్రం త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కు పూర్తి చేసి షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరో వైపు...ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.

English summary
Miss India Pooja Hegde is getting ready to make her Tollywood debut soon. She is being considered for a role opposite Naga Chaitanya in an upcoming movie to be directed by Vijayakumar of ‘Gunde Jaari Gallanthayindhe’ fame. The actor tasted success after a gap of two years with ‘Thadaka’ recently. Apart from Pooja other fresh faces too were being considered, but Nag feels that Pooja fits the bill perfectly. This film is touted to be a romantic comedy entertainer. Mean while Chaitu is busy with the shooting of ‘Manam’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu