»   »  పవన్ ని తక్కువ చేయటానికో మ్యాటర్ దొరికింది

పవన్ ని తక్కువ చేయటానికో మ్యాటర్ దొరికింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ ఇప్పుడు మరోసారి చిత్రంగా సోషల్ నెట్ వర్కింగ్ మీడియాలో హాట్ టాపిక్ గా..కొందరు గిట్టని వారికి టార్గెట్ గా మారారు. రజనీకాంత్ ని మోడి వెళ్లి కలిసిన వేళ.. పవన్ వెళ్లి మోడిని కలవటంతో పోలుస్తున్నారు. అలా పోల్చి రజనీకన్నా తక్కువే అని తేలుస్తున్నారు. పవన్ స్వయంగా వెళ్లి మోడిని కలిసాడని, అదే రజనీ దగ్గరకి వచ్చి మోడి కలిసాడు కాబట్టి అంటూ పనికిరాని లాజిక్ లు చెప్తున్నారు. ఈ విషయమై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ తను మనస్సులో అనుకున్నది చేసారు..అందులో రజనీతో పోల్చటానికి ఏముంది అంటున్నారు. అయితే ఓ వర్గం మాత్రం పవన్ ని ఈ ఇష్యూ చూపి..తక్కువ చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇక రజనీకాంత్‌తో భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం చెన్నైలో దాదాపు అరగంటపాటు భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం చెన్నె వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పోయస్‌ గార్డెన్‌లోని రజనీ నివాసానికి వెళ్లారు. కాషాయ రంగు చొక్కా, ధోవతి ధరించిన మోడీ.. ఆయనకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మోడీతో కలిసి రజనీ మీడియాతో మాట్లాడారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు.

Modi Respects Rajini, Insults Pawan?

రజనీ మాట్లాడుతూ... ''నేను గతంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు మోడీ వచ్చి పరామర్శించారు. ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంటికి రావాలని ఆయన్ను ఆహ్వానించా. ఇప్పుడు చెన్నై వచ్చిన మోడీ.. నాటి నా ఆహ్వానాన్ని గుర్తుపెట్టుకొని మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది'' అని తెలిపారు. తాను, మోడీ పరస్పర శ్రేయోభిలాషులమని, ఆయనకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. మోడీ బలమైన నాయకుడని, సమర్థ పాలకుడని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఆయనకు దేవుడు ఎప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన కోరుకొన్నది జరగాలని దేవుడిని ప్రార్థిస్తానని తెలిపారు.

మోడీ మాట్లాడుతూ- రజనీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. సమావేశం ఫొటోను ఆయన తర్వాత 'ట్విటర్‌'లో పెట్టారు.
ఈ నెల 24న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీతో మోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. భాజపా రాష్ట్రంలో డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే సహా ఆరు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి, ఎన్నికల్లో తలపడుతోంది.

మరో ప్రక్క పవన్‌ కల్యాణ్‌ను భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కలిశారు. భాజపా తరపున ప్రచారానికి రావాలని పవన్‌ను కిషన్‌రెడ్డి కోరినట్లు సమాచారం. సన్నిహితులు, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతానని పవన్‌ చెప్పినట్లు తెలిసింది.

English summary
Pawan Kalyan, himself went to modi's residence at Ahmedabad and extended his support to the BJP and modi. Thus Pawan Kalyan indirectly proved he was the best loyalist to modi. In contrast, modi's treatment on Rajinikanth was different. modi, himself attended to Rajini's residence and begged the former's support for his party and him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu