Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోహన్ బాబు డేరింగ్ స్టెప్: ఎన్టీఆర్ జీవిత కథతో మరో ప్రాజెక్టు.. టైటిల్ రోల్ చేస్తున్న ఫ్యామిలీ హీరో.
తెలుగు సినీ ఇండస్ట్రీలో డేరింగ్ డెసిషన్స్‌తో పాటు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరొందారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రతినాయకుడి పాత్రలతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. ఆ తర్వాత హీరో అవతారం ఎత్తారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. కొన్నేళ్లుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక, తాజాగా ఆయన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో ప్రయోగం చేస్తున్నారు. ఇంతకీ మోహన్ బాబు ఏం చేయబోతున్నారు.? ఎన్టీఆర్ బయోపిక్ సంగతి ఏంటి.? అనేది చూద్దాం.!

సినిమాలకు బ్రేక్... రాజకీయాల్లోకి ఎంట్రీ
మోహన్ బాబు కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పెద్దగా సినిమాలను ఒప్పుకోవడం లేదు. అయితే, గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఆయన మరోసారి కుటుంబంతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అంతేకాదు, అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

అనుకున్నది సాధించి.. పదవులను వద్దని..
ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దీంతో మోహన్ బాబుకు ఏదో ఒక కీలకమైన పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా ఏ నామినేటెడ్ పదవినీ తీసుకోలేదాయన. అంతేకాదు, తనకు పదవులు ముఖ్యం కాదు.. అనుకున్నది చేసి చూపించాం అని చెబుతున్నారు.

ఎన్టీఆర్ జీవిత కథతో మరో ప్రాజెక్టు
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించాడు. అందులో ఒకటి వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇటీవల విడుదలైన టీజర్‌తో అర్థం అయింది. అయితే, అది ఎన్టీఆర్ బయోపిక్ అని తాజాగా ఓ లీక్ బయటకు వచ్చింది.

మోహన్ బాబు డేరింగ్ స్టెప్.. వర్కౌట్ అవుతుందా?
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్ అయిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా.. ఆయన కుమారుడు బాలకృష్ణ నటించిన ‘యన్.టి.ఆర్'కు తోడు రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' వచ్చాయి. అయినప్పటికీ మోహన్ బాబు డేర్ చేసి మరోసారి తన వర్షన్‌లో ఎన్టీఆర్ జీవిత కథను చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

టైటిల్ రోల్ చేస్తున్న ఫ్యామిలీ హీరో.!
‘చదరంగం' అనే టైటిల్‌తో రాబోతున్న వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మంచు విష్ణు నిర్మాణంలో రాజ్ అనంత దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌లో ఎన్టీఆర్ పాత్రను ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ పోషిస్తున్నాడని తెలిసింది. ఇది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన జీ5లో కొద్ది రోజుల్లో ప్రసారం కానుంది.


మోహన్ బాబు టార్గెట్ ఆ మాజీ ముఖ్యమంత్రే
ఈ వెబ్ సిరీస్‌కు మోహన్ బాబే కథా సహకారం అందించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో ఆయన టార్గెట్ చేసింది ఓ మాజీ ముఖ్యమంత్రినే అనేది దాని సారాంశం. రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ వెబ్ సిరీస్ ముందు ముందు ఎన్నో వివాదాలకు కారణం అవుతుందో చూడాలి.