»   » 'గోల్ మాల్ 3' కి మోహన్ బాబు సెటిల్ మెంట్ ఎంత?

'గోల్ మాల్ 3' కి మోహన్ బాబు సెటిల్ మెంట్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన చిత్రం గోల్ మాల్ 3. రోహిత్ శెట్టి దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ హీరోలుగా చేసారు. కరీనా కపూర్ హీరోయిన్ గా చేసింది. దీనిలో పాత్రలను,కొన్ని కీలకమైన సీన్స్ ను తీసుకుని దర్శకుడు శ్రీవాస్ పాండవులు పాండవులు తుమ్మెదా చిత్రం రూపొందించారు.

దాంతో ఈ చిత్రం మొదటి నుంచీ గోల్ మాల్ 3 కి ప్రీమేక్ అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. దీన్ని మోహన్ బాబు మొదటి నుంచీ అంతే సమర్ధవంతంగా ఖండిస్తూ వచ్చారు. తమకూ ఆ సినిమాకూ సంభంధం లేదని మీడియా సమావేసం ఏర్పాటు చేసి మరీ తెలియచేసారు. కానీ ఈ విషయమై బాలీవుడ్ నిర్మాతలు గట్టి పట్టుదలతో వ్యవహరించి, కోర్టుకు వెళ్లి మరీ కాంపన్షేషన్ గా డబ్బు వసూలు చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం.

Mohan Babu final settlement with Golmaal

ఫిల్మ్ సర్కిల్సో వినపడుతున్న దాన్ని బట్టి... గోల్ మాల్ 3 నిర్మాతలకు 90 లక్షలు రూపాయలు చెల్లించబట్టే చిత్రం స్మూత్ గా రిలీజైందని తెలుస్తోంది. వారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే పనిలో ఉండటంతో రిలీజ్ ఆగిపోతుందనే ఆలోచనతో కోర్టు బయిటే అండరస్టాండింగ్ కి వచ్చారని అంటున్నారు. ఈ మధ్యనే దాన్ని మోహన్ బాబు పే చేసాడని తెలుస్తోంది. విడిగా ఈ తరహా కాపీ వివాదాలు లేకుండా కథగా కొనుక్కుని ఉంటే అంత రేటు కట్టాల్సి వచ్చేది కాదని, తొంభై లక్షలు పెద్ద ఎమౌంట్ అని అంటున్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ... రవి అనే రచయిత దగ్గర్నుంచి కథ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఆ కథ 'గోల్‌మాల్ 3' లాగా ఉందని మా రైటర్స్ చెప్పారు. ఈ విషయాన్నే అతన్నడిగాం. అతను 'లేదండీ. నా కథనే వాళ్లు కొట్టేశారు. నా కథని రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ కూడా చేయించాను. ఏదేమైనా ఈ కథకు బాధ్యత నాదే' అని చెప్పాడు. మేం అతన్ని నమ్మాం. ఈ సినిమా రిలీజయ్యాక 'గోల్‌మాల్ 3'కి కాపీయో, కాదో మీరే చెప్పాలి అంటూ మోహన్ బాబు తన తాజా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' కథ కాపీ వివాదంపై స్పందించారు.

English summary
Golmaal 3 team agreed for the smooth release of Pandavulu Pandavulu Tummeda, while Mohan Babu agreed to pay compensation of Rs 90 lakhs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu