»   » మోహన్ బాబు ఆదేశాల మేరకే బాలకృష్ణ వచ్చారంటూ కవరింగ్ ఇచ్చిన లక్ష్మీ..?

మోహన్ బాబు ఆదేశాల మేరకే బాలకృష్ణ వచ్చారంటూ కవరింగ్ ఇచ్చిన లక్ష్మీ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే ఇంట్లో మనిషికో పొయ్యి అన్నట్టుగా వుంది మంచు మోహన్ బాబు కుటుంబ పరిస్థితి. పుత్ర రత్నాలు వెలగబెడతారని మోహన్ బాబు ముందు చూపుతో స్థాపించిన లక్ష్మీ ప్రసన్నబ్యానర్స్ కాదని పెద్దోడు విష్ణు '24 ఫ్రేమ్స్' మరియు చిన్నోడు మనోజ్ 'మంచు ఎంటర్ టైన్ మెంట్స్' అనే రెండు సొంత కుంపట్లు స్థాపించిపడేశారు..

'ఊ కొడతార ఉలిక్కి పడతారా' అనే చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు 'మంచు ఎంటర్ టైన్ మెంట్స్' లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి మోహన్ బాబు, విష్ణు లేకుండా బాలకృష్ణతో జరిపించడం ఏంటని పలువురు ప్రముఖులు చెవులు కొరుక్కొంటుంటే మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు మాత్రం నాన్న గారి ఆదేశాల మేరకే బాలకృష్ణ అంకుల్ తో ఫంక్షన్ జరిపించామని కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఒకప్రక్క ముందున్న బ్యానర్లలోనే సక్సెస్ లేక సగం క్షీణించిపోయిన మోహన్ బాబుకు ఈ మూడోది స్థాపించడం ససేమిరా ఇష్టంలేదనీ, అయినా తన మాటని వినేవారు ఎవరున్నారని లోలోపలే బాధపడిపోతున్నాడని సమాచారం..

English summary
Mohan Babu son Manchu Vishnu started a new banner ’36 Frames’ and produced the film ‘Vastadu Naa Raju’ starring as hero. Now, younger son Manoj also set up a new banner titled ‘Manchu Entertainments’ and is coming up with a film titled ‘Oo Kodathara Ulikki Padathara..’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu