మరో షాక్: పవన్-దాసరి సినిమాలో మోహన్ బాబు విలన్?

By Bojja Kumar

హైదరాబాద్: అసలు పవన్ కళ్యాణ్ దాసరి నారాయణరావుతో కలిసి సినిమా చేయడం అంటేనే పలువురు అభిమానులు ఆశ్చర్యానికి, షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆశ్చర్యకరమైన వార్త ప్రచారంలోకి రావడం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబుతో విలన్ పాత్ర చేయించే ఆలోచనలో ఉన్నారట దాసరి.

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి.....అందులోనూ దాసరి నారాయణరావు నిర్మిస్తుండటం, మెహన్ బాబు విలన్ పాత్ర చేయడం అంటే సినిమా కలెక్షన్ల రేంజి ఊహించడం కష్టమే. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది భారీ కలెక్షన్లు సాధించే సినిమా కావడం ఖాయం అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

Mohan Babu villain role in Dasari-Pawan Film!

ఈ చిత్రం తారక ప్రభు ఫిలిమ్స్‌ పతాకంపై దాసరి నిర్మిస్తున్న 37వ సినిమా. యితే దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. దాంతో ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ దర్శకుడు పూరి జగన్నాథ్ అయ్యిండే అవకాసం ఉందని అంటున్నారు. రీసెంట్ గా ..పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రం చూసి ముగ్థుడైన దాసరి... తనవారసుడి లేని లోటును పూరీ భర్తీచేశాడని కూడా ప్రకటించారు. ఈ ఉదంతాలు చూస్తుంటే దాసరి, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్‌ చిత్రం తీయనున్నారనీ, దానికి పూరీ దర్శకత్వం వహించనున్నారని కూడా ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

తొలుత అలా... తర్వాత మార్పు
దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్‌ కల్యాణ్‌ కలసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త సోమవారం సాయింత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్షనల్ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్‌తో అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని కంగు తిన్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు నిర్మాతగా పవర్ స్టార్ తో అని మార్పు చేసి మళ్లీ పోస్టు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X