Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
NTR30: ఎన్టీఆర్ మూవీలో మరో ఇద్దరు హీరోలు.. విలన్‌గా బడా స్టార్.. లీకైన సెన్సేషనల్ న్యూస్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. అలాగే, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

పాన్ ఇండియా స్టార్‌గా
వరుస విజయాలతో సత్తా చాటుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది.
నీ
భార్యతో
ఎన్నిసార్లు
ఆ
పని
చేశావ్..
లైవ్‌లోనే
ఆమెకు
ఫోన్
కాల్..
అవినాష్
పరువు
తీసిన
శ్రీముఖి
https://telugu.filmibeat.com/television/anchor-sreemukhi-unexpected-question-to-mukku-avinash-115953.html

కొరటాల శివతో సినిమా
RRR సినిమా పట్టాలపై ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత గురూజీని కాదని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

లేటుగా... అనుమానం
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతుండడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఇది ఉంటుందా? లేదా? అన్న డౌట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది.
Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావం

అప్‌డేట్లు.. జనవరిలో
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఈ మధ్య కాలంలో వరుసగా అప్‌డేట్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నట్లు అధికారికంగా మరోసారి ప్రకటించారు. అలాగే, మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాదు, లొకేషన్లు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇక, ఈ మూవీ షూటింగ్ జనవరిలో మొదలవబోతుందని టాక్.

హీరోయిన్‌గా జాన్వీనే
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారని ఇప్పటికే ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా రాబోతుందని అంటున్నారు. ఇక, జాన్వీని ఎంపిక చేశారన్న వార్తలతో తారక్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీళ్ల జోడీని స్క్రీన్‌పై చూసేందుకు వేచి చూస్తున్నారు.
Neha Shetty: షర్ట్ విప్పేసి రచ్చ చేసిన హీరోయిన్.. టెంప్ట్ చేస్తున్నవా రాధికా?

మళ్లీ ఆ స్టార్ హీరోనే
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్లను భాగం చేయాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను తీసుకున్నారని సమాచారం. గతంలో వీళ్ల కాంబోలో 'జనతా గ్యారేజ్' వచ్చిన విషయం తెలిసిందే.

విలన్‌గా ఆ స్టార్ హీరో
భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు కూడా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల ఆయనకు స్టోరీని వినిపించారని, వెంటనే సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇక, ఈ నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.