For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RC15: చరణ్ మూవీలో సీఎంగా స్టార్ హీరో.. శంకర్ పాన్ ఇండియా ప్లాన్.. వాళ్లిద్దరి ఫ్యాన్స్‌కు పండగే

  |

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని అన్ని టాలెంట్లను చూపిస్తూ తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న చరణ్.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తోన్నాడు. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

   చరణ్‌కు ఒక హిట్.. ఒక ఫ్లాప్

  చరణ్‌కు ఒక హిట్.. ఒక ఫ్లాప్


  ఇటీవలే రామ్ చరణ్ RRR అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. అయితే, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం ఎక్కువ నష్టాలతో భారీ డిజాస్టర్‌‌ అయింది.

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  శంకర్‌తో చరణ్ భారీ మూవీ

  శంకర్‌తో చరణ్ భారీ మూవీ


  ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో మెగా హీరో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.

   షూట్ స్పీడ్.. చాలా కంప్లీట్

  షూట్ స్పీడ్.. చాలా కంప్లీట్


  రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్‌లోనూ షెడ్యూల్‌లను పూర్తి చేశారు. ఇటీవలే ఫారెన్‌లో పాటలు చిత్రీకరించారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ కంప్లీట్ చేశారు.

  Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్‌ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

  భారీ బడ్జెట్.. క్లైమాక్స్‌ కోసం

  భారీ బడ్జెట్.. క్లైమాక్స్‌ కోసం


  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్‌ను హై లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ ఎపిసోడ్‌లో బ్లాస్టింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే దీనికి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది. ఈ ఒక్క పార్ట్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు కేటాయించారట. దీనికోసం ఎన్నో స్పెషల్‌ ప్లాన్లను రూపొందిస్తున్నారు.

   చరణ్ సినిమాలో మరో స్టార్

  చరణ్ సినిమాలో మరో స్టార్


  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. దక్షిణాది, బాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటుల పేర్లను కూడా రివీల్ చేశారు. ఈ క్రమంలోనే ఇందులో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

  బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!
  https://telugu.filmibeat.com/heroine/actress-faria-abdullah-stunning-pic-goes-viral-115646.html

  సీఎంగా సూపర్ స్టార్ ఫిక్స్

  సీఎంగా సూపర్ స్టార్ ఫిక్స్


  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మోహన్‌లాల్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. సెకెండాఫ్‌లో వచ్చే ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉండబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చరణ్, మోహన్‌లాల్ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని టాక్.

  పాన్ ఇండియా ప్లాన్ వల్లే

  పాన్ ఇండియా ప్లాన్ వల్లే


  బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రూపొందిస్తోన్నారు. అందుకే ఇందులో దేశం మొత్తం గుర్తింపు పొందిన బడా హీరోలను భాగం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ ముఖ్యమైన పాత్ర కోసం మోహన్‌లాల్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇక, ఈ సూపర్ స్టార్ రాకతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing a film with Top Director S. Shankar. Mohanlal to play Chief Minister Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X