»   » వరుస పెట్టి సీడీలు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ!

వరుస పెట్టి సీడీలు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ గురించి ఫ్యాన్స్ సర్కిల్ లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా అతని గురించి ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు వేగం అందుకున్నాయ. మోక్షజ్ఞ తొలి చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలోనే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Mokshagna's debut created a lot of curiosity

ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట. తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం మోక్షు యూఎస్ఏలో తన చదువు కొనసాగిస్తూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రిలో వచ్చిన వార్తల ప్రకారం.... బాలయ్య 100వ సినిమా పూర్తయిన తర్వాత 2016లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బాలయ్య కూడా పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

English summary
Mokshagna's acting debut has created a lot of curiosity among the Nandamuri fans, who are eagerly waiting to see him on big screen. As per reports Moshagna is going to get trained under none other than his grandfather senior NTR.
Please Wait while comments are loading...