»   » ప్రభాస్, తమన్నా సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. ముంబైలో రూమర్ వైరల్..

ప్రభాస్, తమన్నా సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. ముంబైలో రూమర్ వైరల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 రిలీజ్ తర్వాత సినిమా సాధిస్తున్న రికార్డుల గురించి పక్కన పెడితే.. ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, అనుష్కల గురించి చర్చ విపరీతంగా జరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన అనుష్క నటిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇలా రకరకాల వార్తలు జోరు మీద ఉంటే.. తాజాగా ప్రభాస్, తమన్నా గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది.

ఖామోషీలో ప్రభాస్ అతిథి పాత్ర

ఖామోషీలో ప్రభాస్ అతిథి పాత్ర

నటుడు, కోరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, తమన్నాభాటియా ఖామోషీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే బాలీవుడ్ మీడియా పేర్కొంటున్నది.

 తమన్నా కోసం ప్రభాస్

తమన్నా కోసం ప్రభాస్

సినీ పరిశ్రమలో తమన్నా, ప్రభాస్ మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి చెప్పలేనంత అభిమానం. అలాంటి స్నేహితురాలైన తమన్నా కోసం అతిథి పాత్రలో కనిపించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ప్రభాస్ అంటే నాకు ఇష్టం

ప్రభాస్ అంటే నాకు ఇష్టం

ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. షూటింగ్‌ సమయంలో తన కంటే ఎక్కువ సెక్యూరిటీ నాకు కల్పిస్తాడు. భద్రతా ఏర్పాట్లను జాగ్రత్తగా చూస్తుంటాడు. నాపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటాడు. బాహుబలి సినిమా షూటింగ్‌లో యాక్షన్, ఫైట్ సీన్లలో నా భద్రత గురించి ఆలోచించిన తీరు మరువలేనిది. నా హృదయంలో ప్రభాస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓ స్నేహితుడి కంటే ఎక్కువగా నా కోసం ఆలోచిస్తాడు అని తమన్నా చెప్పింది.

ఆయన మర్యాదలతో చచ్చినంత..

ఆయన మర్యాదలతో చచ్చినంత..

బాహుబలి ప్రమోషన్ సమయంలో నా మీద చూపించిన ప్రేమతో చచ్చిపోయినంత పనైంది. ప్రభాస్ ఫుడ్ లవర్ అనే విషయం తెలిసిందే. ఆయన తినే ఫుడ్‌ నా కోసం పంపించేవాడు. ఆ సమయంలో చేసిన మర్యాదలకు ప్రాణం పోయేది. బాహుబలి షూటింగ్ సమయంలో ఆయన ఉపవాసం ఉంటూ.. నా కార్‌వాన్‌కు ఆహారం పంపించేవాడు.

ఖామోషీలో ప్రభాస్ నటించనున్నారట..

ఖామోషీలో ప్రభాస్ నటించనున్నారట..

ఇదిలా ఉండగా, ఖామోషీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వసు భగ్నానీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అతిథి పాత్ర ప్రభాస్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఆయన మాట్లాడటానికి నిరాకరించాడు. నో కామెంట్.. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. అన్ని తెలుస్తాయి అనడం గమనార్హం.

నాలుగు రోజుల షూటింగ్..

నాలుగు రోజుల షూటింగ్..

సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. నాలుగు రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉన్నది. త్వరలోనే ఆ షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం అని వసూ భగ్నానీ మీడియాకు చెప్పారు.

 సాహో కోసం ముంబైలో ప్రభాస్

సాహో కోసం ముంబైలో ప్రభాస్

మిగిలి ఉన్న నాలుగు రోజుల షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం సాహో చిత్ర షూటింగ్ కోసం ప్రభాస్ ముంబైలో మకాం వేశారు. త్వరలోనే తమన్నా, ప్రభుదేవా చిత్ర షూటింగ్‌లో పాల్గొనే అవకాశముందనే వార్త బలంగా వినిపిస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే బాలీవుడ్‌ తెరపై ప్రభాస్‌ను త్వరలోనే చూసే అదృష్టం అభిమానులకు కలుగుతుంది.

English summary
Ever since the teaser of Saaho released, people are darn excited to see which actress will be seen romancing Prabhas in the same. While there is strong buzz about the casting of Anushka Shetty, we come across another interesting news about Prabhas and his other Baahubali co-star Tamannaah Bhatia. According to the sources, Prabhas might be seen in a cameo in the Prabhudeva and Tamannaah Bhatia starrer Khamoshi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu