»   » "మిసెస్ కురియన్" కథేంటి?: నయన తార పెళ్ళి చేసేసుకుందా..?

"మిసెస్ కురియన్" కథేంటి?: నయన తార పెళ్ళి చేసేసుకుందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాబు బంగారం కోసం ఫారెన్ టూర్ వెళ్ళిన చిత్ర యూనిట్ అక్కడ నయనతార, వెంకటేష్ లపై కొన్ని పాటలను చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంలో వెంకీ, నయనతార, దర్శకుడు మారుతి, నిర్మాత నాగవంశీ చైర్‌లో కూర్చొని ఓ ఫోటోకు ఫోజులిచ్చారు.

అయితే ఈ ఫోటోతో ఇప్పుడు ఈ ఫొటోవల్లే ఓ చిక్కొచ్చిపడింది. డయానా మరియమ్ కురియన్ కోసం "కురియన్" అంటూ ఛైర్ ఏర్పాటు చేశారు కరక్టే.. కాకపోతే "మిస్సెస్ కురియన్" అని రాశారు. అంటే జనాలని ఏదోరకంగా "బాబు బంగారం" చర్చలోకి లాగాలనేనా..?

బాబు బంగారం టీం పోస్ట్ చేసిన ఫోటోలో వెంకీ చైర్‌పై మిస్టర్ వెంకటేష్ అని రాసి ఉండగా, నిర్మాత చైర్‌పై ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్‌పై డైరెక్టర్ అని, నయన కుర్చీ వెనుక "మిసెస్" కురియన్ అని రాసి ఉంది. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

Mrs.Kuriyan..!? Nayanatara Confuses Everyone With new photo

నయన్ అసలు పేరు డయానా మరియమ్ కురియన్ కాగా, ఇండస్ట్రీలోకి వచ్చాక నయనతారగా మార్చుకుంది. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కాని మిసెస్ కురియన్ ఏంటా అని అభిమానులు ఆలోచనలో పడిపోయారు. గతంలో విఘ్నేష్ అనే డైరెక్టర్‌తో నయన్ ప్రేమలో పడిందని రూమర్స్ వచ్చాయి.

ఇదివరలో కూడా శింబూ,ప్రభుదేవా లతో జత కట్టినా పెళ్ళిదాకా వచ్చికూడా విడిపోయారు. మరి ఈసారి అలా జరగ కూడదనుకొని పెళ్ళి చేసేసుకున్నారా..!? లేదంటే సినిమా లో నయనతార పాత్రపేరు "కురియన్ అయుండొచ్చా..? అనే విశయమ్మీదే ఇప్పుడు అంతా కంఫ్యూజన్ లో పడిపోయారు.. అసలు సంగతేమిటన్నది తేలాలంటే సినిమా వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే...

English summary
Is Nayanatara Ms or Mrs? This confusion happened with the recent talk, that she was given a chair on the sets of "Babu Bangaram" that has embossed with her name as "Mrs Kurian".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu