Allu Arjun Atlee Film : అల్లు అర్జున్ సినిమాలోకి మ‌రో స్టార్ హీరోయిన్‌.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

Allu Arjun Atlee Film : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న బన్నీ, ఇప్పుడు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ "AA22xA6" ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధిక చర్చనీయాంశంగా నిలిచింది. ఈ సినిమాకు దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో మరో హీరోయిన్ రొమాన్స్ చేయబోతుందట. ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకీ అట్లీ మాస్టర్ ప్లాన్ ఎంటీ?

అల్లు అర్జున్‌ - అట్లీ కాంబో వస్తున్న మూవీ సోషియో మైథాలజీ ఫాంటసీతో పాటు సై-ఫై యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతుంది. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా దీపికా, అల్లు అర్జున్ కలయికతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్ ఏర్పడింది. యూనిట్ సమాచారం ప్రకారం, వీరి మధ్య సాగే సీన్‌లు ఇండియన్ సై-ఫై సినిమాల‌కు కొత్త విజువల్ బెంచ్‌మార్క్‌గా నిలవనున్నాయట.

Mrunal Thakur joins Allu Arjun and Deepika Padukone in Atlee s Mega Sci-Fi Film AA22xA6

ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నాడు. ఒకవైపు సాధారణ మనిషిగా, మరోవైపు సైబర్‌ ఎన్‌హాన్స్‌డ్ ఫ్యూచర్ వారియర్‌గా కనిపించనున్నాడట. అట్లీ ఈ సినిమాలో టైమ్ ట్రావెల్, టైమ్ రిఫ్ట్‌లు, మిస్టీరియస్ క్రియేచర్స్, పారలల్ డైమెన్షన్స్ వంటి సైన్స్ ఫిక్షన్ అంశాలను అద్భుతంగా మిళితం చేస్తున్నారని సమాచారం. భారతీయ ప్రేక్షకులు ఇంతవరకు చూడని విజువల్ ఎఫెక్ట్స్ అనుభవం ఇవ్వడానికి హాలీవుడ్ స్థాయి విజువల్ టీమ్‌ను తీసుకువచ్చారని టాక్.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇది అట్లీ కెరీర్‌లోనే కాకుండా, సన్ పిక్చర్స్ హిస్టరీలోనూ అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. ప్రస్తుత ముంబై షెడ్యూల్ పూర్తయిన తర్వాత, టీమ్ లండన్, న్యూ యార్క్, దుబాయ్, టోక్యో వంటి నగరాల్లో విస్తృతంగా షూటింగ్ చేయనున్నారట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌తో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అదనంగా, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేయడంతో పాటు, భారతీయ మైథాలజీ స్పర్శను కలపడం ఈ సినిమాకు కొత్త వైబ్రేషన్ ఇస్తోంది.

తాజాగా ఈ సినిమాకు బ్యూటీ స్టార్ మృణాల్ ఠాకూర్ అధికారికంగా జాయిన్ అయ్యారు. సీతారామం, హాయ్ నన్నా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మృణాల్ ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర కథలో ప్రధాన మలుపు తిప్పే కీలక క్యారెక్టర్ అని సమాచారం. మృణాల్ కూడా సోషల్ మీడియాలో "ఇంత భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఉంది" అని స్పందించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్, బీహైండ్ ద సీన్ స్టిల్స్ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటించాయి. ఇండియన్ సై-ఫై సినిమాలు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండొచ్చని నిరూపించే ప్రాజెక్ట్ ఇదే అని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. "పుష్ప" తర్వాత అల్లు అర్జున్ ఎంచుకున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇక అట్లీ వంటి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో ఆయన కాంబినేషన్ పాన్-వరల్డ్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. "ఇది కేవలం సినిమా కాదు - భారతీయ సినిమా దిశ మార్చే సైన్స్ ఫిక్షన్ రివల్యూషన్" అని సినీ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Read more about: atlee allu arjun mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X