»   » వరసపెట్టాడు : కళ్యాణ్ రామ్ కన్ను మరో మిస్ ఇండియాపై

వరసపెట్టాడు : కళ్యాణ్ రామ్ కన్ను మరో మిస్ ఇండియాపై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కళ్యాణ్ రామ్ గత చిత్రం షేర్ లో హీరోయిన్ గా మిస్ ఇండియా 2012లో మిస్ ఇండియా గా ఎంపికైన వన్య మిశ్రాతో రొమాన్స్ చేసారు. ఆ సినిమా చీదినప్పటికీ ఆమెకు మంచి పేరే వచ్చింది. రెగ్యులర్ హీరోయిన్స్ ని అంతంత రెమ్యునేషన్ పెట్టి తెచ్చుకోవటం కన్నా ఫ్రెష్ ఫేస్ ని ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉంటుందని ఆయన మరోసారి మిస్ ఇండియా వైపే మ్రొగ్గు చూపినట్లు సమాచారం.

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ దీనికి నిర్మాత. 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాథ్‌, 'పటాస్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Ms India Aditi Arya to pair with Kalyan Ram

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా 2015 .. అదితి ఆర్య ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఓకే చేస్తే ఇదే టాలీవుడ్ లో ఆమె తొలి చిత్రం. ఆమెను కలిసి ఇప్పటికే టీమ్ కథ ని వినిపించిందని తెలుస్తోంది. స్టోరీలైన్ నచ్చిన అదితి , ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవటానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు చెప్పిందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పటాస్ లోపోలీస్ గా కనిపించి అలరించిన కళ్యాణ్ రామ్ ...ఈ సినిమాలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.

వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే. త్వరలో మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను వెల్లడించనున్నారు.

English summary
Kalyan Ram will be paired with Ms India 2015 Aditi Arya in Puri Jagannadh. film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu