twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' చిత్రం ఏప్రియల్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అయిన ఈ చిత్రంలో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర పూర్తి కామెడీతో రన్ కానుందని తెలుస్తోంది. ఆ పాత్ర రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించి రూపొందించిందని తెలుస్తోంది. వర్మ మ్యానరిజమ్స్ ఈ పాత్రలో కలిపి..ఫన్ చేసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా టీజర్ లో వదిలిన ఎమ్.ఎస్ నారాయణ పాత్ర... కథలు రాసుకోవటానికి చర్లపల్లి జైలు వెళ్తాడని చెప్పి శ్రీను వైట్ల క్యూరియాసిటీ లేపారు. అలాగే ట్విట్టర్ లో ప్రతీదీ రాస్తూంటారని చెప్పటం కూడా వర్మని ఉద్దేశించి అని అంటున్నారు.

    ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 35 నిముషాలు . చిత్రం ఫస్ట్ హాఫ్...గంట 16 నిముషాలు ఉండగా..సెకండ్ హాఫ్ ...గంట 19 నిముషాలు ఉండబోతోంది. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా దర్శక,నిర్మాతలు ఈ చిత్రాన్ని చెప్తున్నారు. 50 మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్‌వోవర్ చెప్పడం విశేషం.

    వచ్చే నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌ షా'. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయటానికి నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించారు.

     'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    దర్శకుడు శ్రీనువైట్లకి దూకుడు తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో ఆయన ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

     'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    అలాగే ‘గబ్బర్‌సింగ్' తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తున్న చిత్రమిదే కావడంతో సహజంగానే అంచనాలు భారీగానే ఉన్నాయి.

     'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    ఏప్రియల్ 1న సెన్సార్ జరిపి 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్, గోపీమోహన్ మాటలు సమకూరుస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ కెమెరాను అందిస్తున్నారు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్‌ని నిర్వహిస్తున్నారు.

     'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    ఇక వేసవిలో విడుదల కానున్న బాద్‌షా సినిమా ఎన్టీఆర్‌కు అతిపెద్ద మైలురాయిగా నిలుస్త్తుందని రచయిత కోన వెంకట్ తెలిపారు. 'బాద్‌షా' సమ్మర్‌లో వచ్చే సునామీ అని అన్నారు. 'బాద్‌షా' అనేది ఎన్టీఆర్ తనపై పెట్టిన బాధ్యత అని అన్నారు.

     'బాద్‌షా' లో ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఆ డైరక్టర్ ని ఉద్దేశించే (ఫోటోలు)

    ‘బాద్‌షా' చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై పాటలకు మంచి స్పందన లభించిందని, థమన్ శ్రోతలను అలరించే స్థాయిలో సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు. యుఎస్‌లో కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్.టి.ఆర్ అభిమానులేకాక అక్కడి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఆయన చెబుతున్నారు.

    English summary
    
 Inside sources say that MS does parody of RGV in hilarious way. Today the comedy trailer of the film ‘Badshah’ was released and many understood that MS’s character resembles RGV with references to twitter dialogue and answering that he would go to Charlapalli jail for story discussions.
 The way MS sat in the interview chair also resembles the body language of RGV.
 We have to see how RGV reacts to this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X