»   » దిల్ రాజు నిర్మాతగా ఎమ్ ఎస్ రాజు కుమారుడు!?

దిల్ రాజు నిర్మాతగా ఎమ్ ఎస్ రాజు కుమారుడు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ రాజు తాజాగా వేణు అనే మరో నూతన దర్శకుడుని పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కథ ఓకే చేసిన దిల్ రాజు ఈ కొత్త చిత్రాన్ని నూతన తారాగణంతో ప్లాన్ చేయనున్నారు. కొత్త బంగారు లోకం తరహాలో ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుందనే ఆలోచనతో ఉన్నారు. ఇక ఈ కొత్త కథ ప్రేమ,స్నేహం అనే పాయింటు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే వేణు ఇంతకుముందు దిల్ రాజు చిత్రాల్లో డైరక్షన్ విభాగంలో పని చేసారు. గత సంవత్సర కాలంగా ఈ స్క్రిప్టుపైనే కూర్చున్నట్లు చెప్తున్నారు. హీరోగా ఎమ్ ఎస్ రాజు కుమారుడుని అడిగే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఇక ఎమ్ ఎస్ రాజు ఆ మధ్య మంత్ర దర్శకుడు తులసీరామ్ తన కుమారుడుతో చిత్రం చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే కథ వర్కవుట్ కాక వదిలేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే తెలుగుకు మరో హీరో, దర్శకుడు దొరికినట్లు అవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu