»   » పూరీ సినిమాలో విలన్ గా ముమైత్ ఖాన్ !?

పూరీ సినిమాలో విలన్ గా ముమైత్ ఖాన్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ "పోకిరీ" లో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన ముమాయిత్ ఖాన్ త్వరలో విలన్ గా కనిపించనుందని సమాచారం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన 'నేను ...నా రాక్షసి' లో ఆమెను నెగెటివ్ పాత్రలో కనిపంచనుందని సమాచారం. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్లో విడుదలవుతుంది.సెకెండాఫ్ లో వచ్చే ఈ పాత్ర చిత్రంలో కీలకంగా మారనుందని అదే సినిమాని లీడ్ చేస్తుందని తెలుస్తోంది.

అవకాశాలు లేక వెనకపడ్డ ముమైత్ ని ఈ చిత్రం మళ్ళీ బిజీ చేస్తుందని భావిస్తున్నారు. అయితే రానా కి లైఫ్ వస్తుందని భావిస్తున్న ఈ చిత్రం ముమైత్ ని ముందుకు తీసుకువెళ్ళేలా ప్లాన్ చేయటం రానా తండ్రి సురేష్ బాబుకు నచ్చటం లేదని ఆయన ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

English summary
Mumaith Khan is to play an important role in the movie Nenu Naa Rakshasi. Now, she was offered with a negative role 
 
 in the movie Nenu Naa Rakshasi under the direction of Puri Jagannadh.Daggubati Rana and Ileana are playing male 
 
 and female lead roles in the movie Nenu Naa Rakshasi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu