»   » షాకింగ్: నయనతారకు అంతుచిక్కని జబ్బు!

షాకింగ్: నయనతారకు అంతుచిక్కని జబ్బు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ ఆమె వ్యక్తిగ జీవితం, సినిమాల గురించి మాత్రమే. కానీ తాజాగా నయనతార హెల్త్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం నయనతార ఓ అంతుచిక్కని చర్మ వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాధి తీవ్రం కావడంతో షూటింగులు కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆమె ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద వైద్య పద్దతిలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నయనతార సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆరంభం' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'అనామిక' చిత్రంలో చేస్తోంది. వీటితో పాటు తెలుగు, తమిళంలో మరో నాలుగు ప్రాజెక్టులకు కమిటైంది.

కాగా...గత కొన్ని రోజుల క్రితం హీరోయిన్ సమంత కూడా స్కిన్ డిసీజెస్‌తో చాలా కాలం పాటు షూటింగులకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార కూడా అలాంటి వ్యాధికే గురైనట్లు తెలుస్తోంది. హీరోయిన్లకు అందమే ప్రధానం కాబట్టి.....దాన్ని కాపాడు కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది నయనతార.

English summary

 Beauty Nayantara is in another trouble. It is heard that applying makeup to her is an issue due to her skin problem. Latest rumor circulating tamil industry is that Nayan has been taking English medicine as well as Kerala Ayurvedic treatment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu