ప్రభాస్ సినిమా విషయంలో స్పీడ్ పెంచిన మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడికి భారీ అడ్వాన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి వస్తున్న విషయం తెలిసిందే. ఫామ్ లో ఉన్న నిర్మాతలు అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తుపై నమ్మకంతో పెద్ద కాంబినేషన్లపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారి వేగాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు. ఇండియన్ హిస్టరీలోనే ఎక్కువ సినిమాలను సెట్స్ పైకి తెస్తున్న నిర్మాణ సంస్థ ఇదేనని చెప్పవచ్చు.
ఇక నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి రెబల్ స్టార్ రేంజ్ కు తగ్గ దర్శకుడిని సెట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఫైనల్ గా వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అతను ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇటీవల మైత్రి నిర్మాతలు ఆనంద్ ను కలిసి భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ దర్శకుడు కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే ఒక కథను కూడా చెప్పాడని టాక్ వచ్చింది. ఇక ఇన్నాళ్లకు మైత్రి ద్వారా మరొక కొత్త కథను ఫైనల్ చేయించారని అంటున్నారు. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తేనున్నాడు.


Click it and Unblock the Notifications











