Don't Miss!
- Sports
ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: టామ్ లాథమ్
- News
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
మైత్రి మూవీ మేకర్స్ రాబోయే బిగ్ మూవీస్.. బాలీవుడ్ హీరోతో కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్!
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న బ్యానర్లలో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఈ ప్రొడక్షన్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినవే. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో మాత్రం మంచి సక్సెస్ అయితే అందుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఏకంగా ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను ఒకే సారీ విడుదల చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఒకేసారి సంక్రాంతిలో ప్రేక్షకుల ముందుకు రావడం ఒక హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ సంక్రాంతి ఫెస్టివల్లో కూడా ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు లేవు. అది కూడా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను విడుదల చేయడం విశేషం. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నట్లుగానే తెలుస్తోంది.

అంతేకాకుండా పుష్ప 2 సినిమా తర్వాత వారు మరిన్ని పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఆ లిస్టులో అయితే ముందుగా ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో కూడా వారు చర్చించారు. ఇద్దరికీ కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మరొక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా ఇదివరకే ఒక టాక్ వినిపించింది.
అలాగే హరీష్ శంకర్ కూడా దర్శకుడిగా ఫిక్స్ అయినట్లు కథనాలు వెలుపడ్డాయి. ఎందుకంటే చిత్ర నిర్మాతలు హరిశంకర్ తో కలిసి సల్మాన్ ఖాన్ ను ఒకసారి సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. అయితే హరీష్ శంకర్ చెప్పిన కథ మాత్రం ఫైనల్ కాలేదు. ప్రస్తుతం అయితే నిర్మాతలు మంచి కంటెంట్ ఉన్న దర్శకుడి కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులను సెలెక్ట్ చేయండి అని ప్రత్యేకంగా మైత్రి వారిని కోరినట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్స్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.