»   » ఓవర్ సీస్ లో 'నాన్నకు ప్రేమతో' కు దెబ్బ?

ఓవర్ సీస్ లో 'నాన్నకు ప్రేమతో' కు దెబ్బ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఓవర్ సీస్ లో ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసారు. ఈ మేరకు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏర్పాట్లు అన్ని చేసారు. దాదాపు 190 స్క్రీన్స్ లో ఈ ప్రీమియర్ షోని ఏర్పాటు చేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోలకు ఇబ్బంది ఏర్పడింది. సెన్సార్ అవటం లేటవటంతో సినిమా డ్రైవ్స్ ని అనుకున్న సమయానికి పంపలేకపోయారని వినికిడి.

దాంతో దాదాపు సగం లొకేషన్స్ లో ప్రీమియర్ షోలు పడే అవకాసం లేదంటున్నారు. ఎందుకంటే ఆ సమయానికి ఈ డ్రైవ్స్ చేరే అవకాసం లేదంటున్నారు.దాంతో అక్కడి ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారని వార్త. అయితే చివరి నిముషంలో ఏదన్నా మిరాకిల్ జరిగితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది.


​సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు గాబోతున్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. విలువలతో కూడిన ఈ సినిమాను ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు ఎన్టీఆర్.


Naannaku Prematho..disappoints overseas viewers

 
యు.ఎస్.ఎ. లో సుమారు 190 దియోటర్స్ లో దీన్ని విడుదల చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎక్కవ దియోటర్స్ లో విడుదలవుతున్న సినిమా. సుకుమార్ సినిమాలకు మంచి డిమాండ్ వుంది అక్కడ, హీరోని మంచి స్టైలిష్ గా చూపిస్తారని, కథా కథనం బాగుంటాయని ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఎక్కువగా వున్నాయి.

చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను.


ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన. నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే.


ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.

English summary
‘Nannaku Prematho’ censor is not complete until then leaving the makers very little time to ship the drives.
Please Wait while comments are loading...