»   » అనూష్కతో కలిసి 'రగడ' చేయటానికి నాగార్జున రెడీ

అనూష్కతో కలిసి 'రగడ' చేయటానికి నాగార్జున రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున,వీరూపోట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రానికి రగడ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కామాక్షి మూవీస్ బ్యానర్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా ప్రియమణి చేస్తోంది. అలాగే ఈ చిత్రం టైటిల్ ఏమిటన్నది త్వరలోన ట్విట్టర్ ద్వారా తెలిపుతానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు నాగార్జున. అలాగే నాగార్జున...రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి రాజన్న అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వీటితో పాటుగా నాగార్జున ..త్వరలో అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ చిత్రలో నటించబోతున్నారు. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో మొదలయిన గగనం చిత్రం షూటింగ్ పూర్తయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu