For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హాట్ టాపిక్: నాగార్జున, అనుష్క లిప్ లాక్ కిస్

  By Srikanya
  |

  హైదరాబాద్: గతంలో కమల్ హాసన్ సినిమా అంటే గ్యారెంటీగా హీరోయిన్ తో ఓ లిప్ లాక్ కిస్ ఉంటుందని జనం ఉత్సాహపడేవారు. అయితే రీసెంట్ గా తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ లిప్ లాక్ కిస్ లు ఇప్పుడు ఓ ఆనవాయితీగా మారాయి. నాగార్జున, అనుష్క పెయిర్ అంటే ప్రేక్షకులలో మంచి క్రేజ్. దాన్ని క్యాష్ చేసుకునే దిసగా నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' ముస్తాబైందని సమాచారం. ఈ చిత్రంలో ఓ పాటలో సముద్రంలో అండర్ వాటర్ లో వీరిద్దరు మధ్య ఓ లిప్ లాక్ కిస్ ఉంటుందని, అది సినిమాక్ హాట్ ఐటమ్ గా ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీపావళి కానుకగా ఈ నెల 9వ తేదీన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం పాటలు హిట్ అయ్యి సినిమాకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.

  నాగార్జున మాట్లాడుతూ... దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న బంధం చుట్టూ 'డమరుకం' కథ అల్లుకొని ఉంటుంది. దీంట్లో ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి. ఈ నెల 9 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని ఆయన తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. మనవైన ఆచారాలు, సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగా ఇందులో చెబుతున్నాం. నాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

  తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

  నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

  English summary
  A talk is doing rounds that Sweety Anushka has shown her oomph factor again in Dhamarukam flick. It is heard that there is a lip kiss in this flick between Nag and Anushka and that takes place below the sea. This underwater song is going to be a part of a song but not any particular scene. However insiders stated that there is a small peck on the lips but not a French style kissing session.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more